మోదీ ప్రభుత్వానికి షాక్, హిందీ కంపల్సరీ ఉపసంహరణ

భాష లైవ్ వైర్ ను ముట్టుకుంది  ప్రధాని మోదీ కొత్త ప్రభుత్వం. అంతే తెగ షాక్ కొట్టింది. హిందీ ని నర్సరీ నుంచి ఇంటర్ మీడియట్ వరకు కంపల్సరీ చేయాలని ప్రతిపాదిస్తూ  నేషనల్ ఎజుకేషన్ పాలసీ 2019 ముసాయిదా ను విడుదల చేసిన సంగతి. దీని మీద వ్యతిరేక తీవ్రంగా రావడంతో గుట్టుచప్పుడు కాకుండా కంపల్సరీ అనే క్లాజ్ ను తీసేశారు.
ఇంతవరకు  ఇది కేవలం  ముసాయిదా మాత్రమేనని, రాష్ట్రాల అభిప్రాయం, ప్రజాభిప్రాయం సేకరించాకా మాత్రమే తుదిరూపం ఇస్తామని ఇద్దరు తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్ ల చేత నిన్న ట్వీట్లు ఇప్పించారు. అయితే, ఈ ట్వీట్లు మంటలను చల్చార్చేలా కనిపించకపోవడంతో ఈ రోజు కామ్ గా హిందీ ని తప్పనిసరిచేయాలన్న క్లాజ్ ను తొలగించారు.
తమిళనాడు పార్టీలు, ప్రజలు అవసరమయితే కేంద్రంతో కొట్టాడేందుు వెనుకాడరు. జల్లికట్టు విషయం ఇది చూశాం, ఇపుడు హిందీ విషయంలో బిజెపికి తమిళభుజంగా ఉన్న రూలింగ్ పార్టీ కూడా హిందీ రుద్దడాన్ని వ్యతిరేకించి ప్రతిక్షాలతో గొంతు కలిపింది. తెలుగు రాష్ట్రాలలో ఒక్క పార్టీ కూడా ఈ ప్రతిపాదన మీద స్పందించనేలేదు.
దక్షిణ భారత దేశంలో కాలుమోపేందుకు భారతీయ జనతా పార్టీ చాలా కష్టపడుతూ ఉంది. అయినా కూడా పెద్దగా ఫలితం లేదు. సీట్లు రాకపోయినా, ఆ పార్టీకి ఎఐఎడిఎంకె ఫ్రెండ్ గా దొరకడం ఒక విజయమే. ఈ పార్టీ ని అసరా చేసుకుని  భవిష్యత్తులో ఇక్కడ జండా ఎగరేయాలనుకుంటున్నపుడు డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన నివేదిక నిప్పురాజేసింది.
పార్లమెంటులో బిజెపికి వచ్చిన అఖండ విజయం చూసి దక్షిణాది రాష్టాల వాళ్లు జడిసి పోయి ‘జై హిందీ’ అంటారని బిజెపి భావించినట్లుంది.  అయితే, తమిళనాడు తిరుగుబాటు చూసి బిజెపియే జడుసుకుంది. కొత్త విద్యావిధానం నుంచి హిందీ తప్పనిసరి అనే క్లాజ్ ను ఎత్తేసింది.   హిందీకి సంబంధించిన పేరాను సవరించి కొత్త ముసాయిదాను మానవ వనరుల శాఖ ముసాయిదాలో అప్ లోడ్ చేశారు.
మొదటి ప్రతిపాదన

సవరించిన ప్రతిపాదన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *