కోమటిరెడ్డిని ఇరకాటంలోకి నెట్టిన మంత్రి హరీష్

అధికారంలో ఉన్న వాళ్ళను ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు చెడుగుడు ఆడుకోవడం సహజం. కానీ నల్లగొండ లో ప్రతిపక్ష నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని మంత్రి హరీష్ రావు ఇరకటంలోకి నెట్టారు. నల్గొండ జిల్లాలో ఆదివారం మంత్రి హరీష్ పర్యటించారు. వివరాలు ఇవి…

నల్ల నిమ్మ మార్కెట్ ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే..

నల్గొండ జిల్లాలో నిమ్మ, బత్తాయి మార్కెట్ ఏర్పాటు అన్నది ఓ కల.

సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నిమ్మ, మార్కెట్ ఏర్పాటు కల నకిరేకల్ లో నేడు నిజమయింది.

నిమ్మ మార్కెట్ రాక ముందు రైతులు ‌ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇరవై ఏళ్లయినా ఈ మార్కెట్లు వచ్చేవి కాదు.

ఇరవై‌సార్లు దరఖాస్తు చేసినా మా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మ, బత్తాయి మార్కెట్ మంజూరు చేయలేదు.సీఎం కేసీఆర్ మంజూరు చేశారని కోమటి రెడ్డి వెంకటరెడ్డే చెప్పారు.

నకిరేకల్ లో కోల్డ్‌స్టోరేజీ కావాలని ఎమ్మెల్యే వీరేశం కోరారు. కోల్డ్ స్టోరేజీ మంజూరు చేస్తున్నా.

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం‌ అందుకునేది పాత వరంగల్ జిల్లా, సూర్యపేట జిల్లానే.

కాంగ్రెస్ నేతలు తమలో తాము గొడవపడం తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదు.

కుర్చీ కోసమే కాంగ్రెస్ కొట్లాట. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోత, విత్తనాలు,‌ఎరువుల కొరత.

నీటి నిర్వహణ లో తెలంగాణ చక్కటి ప్రతిభ కనపరుస్తోందని కేంద్రం కితాబిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *