మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురవుతున్నది

రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతున్నా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ జీవితంలోకి ఆనందపు ఘడియలు ప్రవేశిస్తున్నాయి.

అఖిల వివాహం చేసుకుంటునట్లు, నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. పోటోలు కూడా విడుదలయ్యాయి.

ఈ ఉదయం హైదరాబాదులోని ఆమె నివాసం లోనే  నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి కేవలం మంత్రి కుటుంబ సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.  ఈ కార్య  క్రమం ఫోటోలు సోషల్ మీడియాలో యమవైరలయ్యాయి. అబ్బాయెవరో కాదు, మాజీ డిజిపి సాంబశిశరావు సమీప బంధువయిన బార్గవ్ రామ్ అని చెబుతున్నారు. అఖిల ప్రియకు ఇది రెండో వివాహం. మొదటి భర్త నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *