‘మహానాడు’ విందులో ఎన్టీయార్ కు ఇష్టమయిన వంటలు

చవులూరించే భోజనం.. సంప్రదాయ పిండివంటకాల ఘమఘుమలు.. నోరూరించే స్వీట్లు, ఆంధ్రా ప్రత్యేక పచ్చళ్ళు, వేపుడులు, పులుసులు, ఫ్రైలు… ఉదయం వెరైటీ అల్పాహారాలు, సాయంత్రం కమ్మటి స్నాక్స్‌.. ఓహ్‌! మూడు రోజుల పాటు మృష్టాన్న భోజనం తిని త్రేన్చాల్సిందే. మహానాడు భోజనమా మజాకానా?! మహానాడుకు అత్యద్భుతంగా వండి వార్చే ‘అంబికాస్‌ కేటరింగ్‌ అండ్‌ ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌’కే ఈ మహానాడులో కూడా భోజనాల బాధ్యతలను అప్పగించారు. భోజనాల ఏర్పాట్లకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఇన్‌చార్జిగా ఉన్నారు. కో ఆర్డినేటర్‌గా అర్బన్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభి పర్యవేక్షిస్తున్నారు.

మహానాడు మూడురోజుల పాటు మొత్తం రెండు లక్షల మందికి భోజనాలు వండి వార్చబోతున్నారు. అరవై వేల మందికి ఉదయం అల్పాహారాలుMa, లక్ష మందికి పైగా సాయంత్రం స్నాక్స్‌ వంటివి పంపిణీ చేయబోతున్నారు. నాలుగు ఫుడ్‌కౌంటర్లను.. కడియాల బుచ్చిబాబు, గొట్టుముక్కల రఘురామరాజు, కాట్రగడ్డ శ్రీను, బొండా ఉమాలకు అప్పగించారు. వీఐపీ కౌంటర్‌ను చెన్నుపాటి గాంధీ, మీడియాకు బండారు హనుమంతరావు, పోలీసులకు చిరుమామిళ్ళ సూర్యనారాయణ ప్రసాద్‌, స్నాక్స్‌ ఇన్‌చార్జి కోయా ఆనంద్‌లు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మూడు రోజులు మెనూ ఇదే..

ఈ నెల 27న:

అల్పాహారం: స్వీట్‌ రవ్వకేసరి, గోధుమ రవ్వ స్వీటు ఇడ్లీ, మైసూరు బొండా, టమాటా బాత్‌, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టీ, కాఫీ.
మధ్యాహ్న భోజనం: ఆపిల్‌ హల్వా, పూర్ణం, మద్రాసు పకోడి, కొబ్బరి అన్నం, కడాయ్‌ వెజిటబుల్‌ కూర్మా, రైతా, మామిడి ఆకురాల పప్పు, దొండకాయ్‌ కార్న్‌ కోటెడ్‌ ఫ్రై, ములక్కాడ టమోట కర్రీ, గుత్తి వంకాయ కూర, బీరకాయ – పచ్చి బటాని, పచ్చి టమోట, కొత్తిమీర రోటీ చట్నీ, మామిడి పచ్చడి. డైమండ్‌ చిప్స్‌, సాంబార్‌, మజ్జిగచారు, వైట్‌ రైస్‌, పెరుగు, ఐస్‌క్రీమ్‌.
సాయంత్రం: స్నాక్స్‌గా తాపేశ్వరం కాజ, ఆకు పకోడి.
రాత్రి భోజనం: సేమ్యా కేసరి, మిర్చి బజ్జి, టమాట పప్పు, బంగాళదుంప ఫ్టై, దోసకాయ కూర, గోంగూర చట్నీ, సాంబార్‌, చిప్స్‌, వైట్‌ రైస్‌, పెరుగు.

ఈ నెల 28వ తేదీన:

ఎన్‌టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఇష్టమైన ప్రత్యేక మెనూ ఉంటుంది.అల్పాహారం: స్వీట్‌ సేమ్యారవ్వ కేసరి, ఇడ్లీ, పునుగు, గారి, కట్టిపొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ, టీ – కాఫీ
మధ్నాహ్నం భోజనం: చక్కెర పొంగలి, బాదం కత్రి, మసాల వడ, చింతపండు పులిహోర, వెజ్‌ బిర్యానీ, వెజ్‌ జైపూర్‌ కూర్మా, రైతా, ముద్దపప్పు, దప్పళం, బెండకాయ కొబ్బరి ఫ్రై, వంకాయ బటాణీ ఫ్రై, కొత్త మామిడి పచ్చడి, గోంగూర చట్నీ, ఉలవచారు క్రీమ్‌, సాంబారు, ప్లవర్‌ పాపడ్‌, వైట్‌ రైస్‌, హెరిటేజ్‌ పెరుగు, హెరిటేజ్‌ ఐస్‌క్రీమ్‌.
సాయంత్రం: స్నాక్స్‌గా పూతరేకులు, కాజు, వేరుసెనగ పకోడి అందిస్తారు.
రాత్రి భోజనం: బెల్లం జిలేబీ, వెజ్‌ కట్లెట్‌, పప్పు ఆకు కూర, వంకాయ పకోడి, సింగిల్‌ బీన్స్‌ గ్రేవీ కర్రీ, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ చట్నీ, సాంబార్‌, చిప్స్‌, వైట్‌ రైస్‌, పెరుగును అందిస్తారు.

29వ తేదీన:
అల్పాహారం: ఇడ్లీ, పునుగు, రవ్వ ఉప్మా, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ , టీ/కాఫీ
మధ్నాహ్న భోజనం: బ్రెడ్‌ హల్వా, గులాబ్‌జామ్‌, కార్న్‌రోల్‌, టమాటో రైస్‌, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కూర్మా, రైతా, టమాటా పప్పు, క్యాబేజీ – క్యారట్‌ – కోకోనట్‌ ఫ్రై, సొరకాయ మసాలా కర్రీ, బెండకాయ పులుసు, మిక్స్‌డ్‌ వెజిటబుల్స్‌ రోటి పచ్చడి. మామిడికాయ పచ్చడి, ఫ్లవర్‌ పాపడ్‌, సాంబార్‌, పచ్చి పులుసు, అన్నం, హెరిటేజ్‌ పెరుగు, హెరిటేజ్‌ ఐస్‌క్రీమ్‌.
సాయంత్రం: స్నాక్స్‌గా బందరు లడ్డు, మురుకలు అందిస్తారు.
రాత్రి భోజనం: ఫ్రూట్‌ కేసరి, అరటికాయ బజ్జీ , సొరకాయపప్పు, దొండకాయ కొబ్బరి ఫ్రై, మామిడి – దోసకాయ – మిల్‌మేకర్‌ చట్నీ, సొరకాయ చట్నీ, సాంబార్‌, చిప్స్‌ వైట్‌ రైస్‌, పెరుగు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *