Home Breaking నేడు మహాాకవి వర్ధంతి : శ్రీశ్రీ గానం చేసిన …‘పొలాలనన్నీ హలాల దున్ని…’(వీడియో) TOP STORIESBreakingEnglish నేడు మహాాకవి వర్ధంతి : శ్రీశ్రీ గానం చేసిన …‘పొలాలనన్నీ హలాల దున్ని…’(వీడియో) By Trending News - April 30, 2019 793 0 Facebook Twitter Pinterest WhatsApp నేడు మహాకవి శ్రీశ్రీ వర్ధంతి.ః ఈ సందర్భంగా శ్రీశ్రీ పాల్గొన్న ఒక సమావేశం వీడియో. ఈ సమావేశంలో ఆయన తన ‘పొలాల నన్నీ హలాల దున్నీ’ కవితాగానం చేశారు. https://trendingtelugunews.com/wp-content/uploads/2019/04/శ్రీ-శ్రీ-Sri-Sri.mp4 ఇదే ఆ మహా కవిత ప్రతిజ్ఞ పొలాల నన్నీ , హలాల దున్నీ, ఇలాతలంలో హేమం పిండగ- జగానికంతా సౌఖ్యం నిండగ- విరామ మెరుగక పరిశ్రమించే, బలం ధరిత్రికి బలి కావించే, కర్షక వీరుల కాయం నిండా కాలువకట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి, ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు లేదోయ్! నరాల బిగువూ, కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని- గనిలో, పనిలో, కార్ఖానాలో పరిక్లమిస్తూ, పరిప్లవిస్తూ ధనికస్వామికి దాస్యంచేసే, యంత్రభూతముల కోరలు తోమే, కార్మిక వీరుల కన్నుల నిండా కణ కణ మండే, గలగల తొణికే విలాపాగ్నులకు, విషాదాశ్రులకు ఖరీదుకట్టే షరాబు లేడోయ్! నిరపరాధులై దురద్రుష్టంచే చెరసాలలలో చిక్కేవాళ్ళూ- లోహ రాక్షసుల పదఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్ళూ- కష్టం చాలక కడుపుమంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ- శ్రమ నిష్పలమై, జని నిష్ఠురమై, నూతిని గోతిని వెదికేవాళ్ళూ- అనేకులింకా అభాగ్యులంతా, అనాధులంతా, అశాంతులంతా దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో విప్లవశంఖం వినిపిస్తారోయ్! కావున-లోకపుటన్యాయాలూ, కాల్చేఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ పరిష్కరించే, బహిష్కరించే బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ, నాలో కదలే నవ్యకవిత్వం కార్మిక లోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా, సమర్చనంగా- త్రిలోకాలలో, త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ- వ్యధార్త జీవిత యధార్ధ ద్రుశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్! కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వ్రుత్తుల సమస్త చిహ్నాలు- నా వినుతించే, నా విరుతించే, నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి, భావ్యం! భాగ్యం! ప్రాణం! ప్రణవం.