Home Breaking రాబోయేది హంగ్ పార్లమెంటే, కెటిఆర్ అంచనా

రాబోయేది హంగ్ పార్లమెంటే, కెటిఆర్ అంచనా

286
0

2019 పార్లమెంటు ఎన్నికల్లో  ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ దక్కదని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు.

# ఈరోజు #AskKtr పేరిట ట్విట్టర్లో నెటిజన్లతో కేటీఆర్ సంభాషించారు.
# గత ఎన్డీయే ప్రభుత్వం పలు అంశాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందపి , రాబోయే నూతన ప్రభుత్వం ద్వారా తెలంగాణ డిమాండ్లను సాధించుకుంటామని ఆయన చెప్పారు.
# ఇంటర్ పరీక్ష పరిణామాలు దురదృష్టకరం, విద్యార్థిని కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఒక తండ్రిగా అర్థం చేసుకోగలుగుతాని ఆయన అన్నారు.
# బాధ్యులపై నా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటదన్న నమ్మకం కేటీఆర్ వ్యక్తం చేశారు.

ట్విట్టర్ సంభాష విశేషాలు 

కేంద్రంలో రానున్నది ఖచ్చితంగా హంగ్ పార్లమెంటే అని, ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపోయే మెజార్టీ రాదన్నారు. తమ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 16 కు16 స్థానాలు లభిస్తాయన్నారు.

రాబోయే కేంద్ర ప్రభుత్వం అయినా నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ మేరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తామన్నారు. గత ఎన్డీయే ప్రభుత్వం హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ నెట్ వర్క్ విషయంలో తెలంగాణ కి తీవ్ర అన్యాయం చేసిందని, కనీసం రాబోయే కేంద్ర ప్రభుత్వం అయినా అన్యాయాన్ని సరిదిద్దుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలన్న నెటిజన్ల ప్రశ్నకి 2024 చాలా దూరంలో ఉందని చమత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సరిపోతాడా అన్న ప్రశ్నకి తన అభిప్రాయంతో ఏమాత్రం అవసరం లేదని ఆంధ్ర ప్రజలు దాన్ని నిర్ణయిస్తారన్నారు.తనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదన్నారు. తమిళనాడులో టీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇప్పటికే అక్కడ చాలామంది నాయకులు ఉన్నారన్నారు.

ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్యల పైన స్పందించిన ఆయన జరిగిన పరిణామాలు దురదృష్టకరమైన అని, ఒక తండ్రిగా బిడ్డని కోల్పోయినవారి బాధను అర్థం చేసుకోగలుగుతానన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో ఒక కమిటీని వేసిందని, కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై న కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.

పార్టీ తరఫున ప్రజాప్రతినిధులందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు తనవంతు ప్రయత్నం చేస్తా అన్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు ట్విట్టర్ లో అందుబాటులో ఉన్నారన్నారు.

ఆంధ్ర ఎన్నికల్లో బ్రాండ్ హైదరాబాద్ కి సంబంధించిన ప్రచారం జరిగిందన్న విషయానికి స్పందిస్తూ,హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్ కేవలం మాటలతో చెరిగిపోదని తెలిపారు. నగరంలో స్టార్టప్ ఈకో సిస్టం కోసం ప్రభుత్వం వైపునుంచి అవసరమైన సహాయ సహకారాలు కొనసాగిస్తామన్నారు. ఇమేజ్ టవర్స్ నిర్మాణం కొనసాగుతుందన్నారు.
ఎంఎంటీఎస్ రెండో దశ కోసం 400 కోట్ల రూపాయలు విడుదల చేశామని బిజెపి చేస్తున్న ప్రచారం అవాస్తవమని విధులు ఇప్పటికీ విడుదల కాలేదు అన్నారు.

హైదరాబాద్ నగరానికి సంబంధించి పలువురు నెటిజన్లు వేసిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.ముఖ్యంగా నగరంలోని కనెక్టివిటీకి సంబంధించిన సవాలు అన్ని నగరాలకు ఎదురయ్యేదే అని, దాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎల్బీనగర్ నాగోల్ మద్య మెట్రోను కనె క్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సంబంధిత కార్యాచరణ ప్రణాళిక దశలో ఉందన్నారు. ఇప్పటికే జవహర్ నగర్ డంపింగ్ సంబంధించిన ట్యాపింగ్ పనులు జరుగుతున్నాయని మరికొంత పని పూర్తి చేయాల్సి ఉందన్నారు. కంటోన్మెంట్ సికింద్రాబాద్ స్కైవె కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి స్థలానికి సంబంధించిన అనుమతులు రావాల్సి ఉందన్నారు.

పలువురు ట్విట్టర్ ద్వారా అడిగిన వైద్య ఆరోగ్యానికి సంబంధించిన వినతులను సానుకూలంగా పరిశీలించి సహాయం చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకి అవెంజర్స్ గురించి తనకు తెలియదని అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ఇంతవరకు చూడలేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here