కేసిఆర్, ఈటల పై కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ (వీడియో లీక్)

మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ప్రస్తుత తెలంగాణ సివిల్ సప్లై శాఖ, ఆర్థిక శాఖల మంత్రి ఈటల రాజేందర్ గురించి కోమటిరెడ్డి ఈ వీడియోలో సంచలన కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ తనకు బామ్మార్ది వరుస అవుతారని అన్నారు. ఈటల అత్తగారు మా ఊరి పక్కనే అన్నారు. ఈ సంభాషణ అంతా కోమటిరెడ్డి తన సన్నిహితుల వద్ద చేశారు.

ఇక కేసిఆర్ గురించి కూడా గరం గరం కామెంట్స్ చేశారు. అయితే తన సన్నిహితుల ముందే కోమటిరెడ్డి మంత్రి ఈటల రాజేందర్ తో ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడే క్రమంలో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు. తెలంగాణ సర్కారులో కేసిఆర్ తప్ప అందరూ మంచి దోస్తులే అని చెప్పారు. అంతేకాదు పార్టీ మారనందుకే తనమీద కేసిఆర్ గుర్రుగా ఉన్నట్లు కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

కోమటిరెడ్డి మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన మాట్లాడుతుండగా ఆయన అనుచరులు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలోకి వదలారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కోమటిరెడ్డి ఏమన్నారో కింద వీడియోలో ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *