కెజిఎఫ్ యశ్, శ్రీయ “మహా చంద్ర  మూవీ డబ్బింగ్ పూర్తి

నైనా ఫిలిమ్స్ పతాకం పై  యశ్  ,ప్రేమ్ కుమార్, శ్రీయ  నటీనటులు గా  రూప అయ్యర్ దర్శకత్వం లో షాన్వాజ్ నిర్మించిన  చిత్రం ” మహా చంద్ర”.ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత షాన్వాజ్ మాట్లాడుతూ ” కన్నడ లో సూపర్ హిట్ అయిన చంద్ర చిత్రాన్ని  మహా చంద్ర పేరు తో  తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.యశ్ ఈ చిత్రంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. అలాగే శ్రీయ తన అద్భుతమైన నటన తో ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాం. అన్నారు. దామోదర వనాఛార్య  సమర్పణలో  తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  సంగీతం: గౌతమ్ శ్రీ వాస్తవ, కెమెరా: దాస్, నిర్మాత:షాన్వాజ్, దర్శకత్వం:రూప అయ్యర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *