ఢిల్లీ దండయాత్రకు కెసిఆర్ రెడీ, సంతోష్ సారధి

ఎర్రకోట జండా ఎగరేసేందుకు రాజధానికి వెళ్తున్నా,  తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 2019 వరకూ ఉంటానని ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రకటించారు. తన ఉత్తరదేశ జైత్ర యాత్రలో తనకు తోడుగా ఉండేందుకు, అన్ని విధాల సహాయపనులు చేపట్టేందుకు సంతోష్ రావు రాజ్యసభలో ఉండాల్సిందేనని, అందుకే తాను ఆయన్ని ఢిల్లీ తీసుకెళ్తున్నానని కెసిఆర్ ప్రకటించారు.  కెసిఆర్ కుటుంబానికి  అయిదో ఉద్యోగం అని విమర్శకులు అనకుండా ఆయననోరు మాయించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే, తెలంగాణ బిడ్డ ఢిల్లీ పీఠం కోసం జైత్ర యాత్రకు వెళ్తున్నపుడు అయిదో ఉద్యోగం,ఆరో ఉద్యోగం అని అపశకునం మాటలు అనకుండా  ప్రయత్నం చేశారు. ఆయన ఢిల్లీ దారి పడుతూనే కొడుకు ఐ టి మంత్రి కెటిఆర్ ముఖ్యమంత్రిని చేస్తారని వినవస్తున్న కథనాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.  ఈ ప్రకటన చేస్తున్నపుడు ఆయన కుడిచేతి దట్టీ కూడా ఉంది. ఆయన దట్టి కట్టుకుని చేసే ప్రకటనలు, చేపట్టే కార్యక్రమాలు విజయవంతమమవుతాయని నమ్మకం. సాధారాణంగా శాసన సభాపక్ష సమావేశాలకు ఆయన దట్టీ కట్టుకోరు. ఎదయినా దీక్ష తో చేస్తున్నపుడు, పెద్ద కార్యక్రమం ప్రారంభిస్తున్నపుడు, చేస్తున్న పనికి రాజకీయ అడ్డంకులు రాకుండా ఉండేందుకు ఆయన ఈ శక్తివంతమయిన దట్టీ కట్టుకుంటారని ఒక శాసన సభ్యుడు తెలిపారు.

ఈ ధైర్యంతోనే ఆయన తన ఫ్రంట్ ధర్డ్ ప్రంట్ అని పత్రికల్లో వస్తున్న వార్తలను తోసిపుచ్చారు.  ఇలా తనని మూడో స్థానంలోకి నెట్టేయడం ఆయనకు నచ్చలేదు.అందుకే థర్ఢ్ ఫ్రంట్ కాదు, మొదటి ఫ్రంటే… అని చెప్పారు.

 ఆదివారం జరిగిన టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో తను చేపట్టే బోయే బృహత్కర కార్యక్రమం గురించి ఆయన చాలా వివరాలందించారు. 

019 తర్వాత దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పారు. ఆయన ప్రకటనకు చప్పట్లతో ప్రజా ప్రతినిధులు తమ మద్దతు తెలిపారు. మనది థర్డ్‌ ఫ్రంట్‌ కాదని, ఫస్ట్‌ ఫ్రంట్‌ అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల తరవాత రిజర్వేషన్లపై ఢిల్లీలో ధర్నా చేద్దామని  ఆయన పిలుపు నిచ్చారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్ల బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు, అప్పగించారు. జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఈటల రాజేందర్‌ ఆయనకు సహకరించనున్నారు. బడ్జెట్ సమావేశాలలో గవర్నర్‌ ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగిలితే సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. సభకు ఎమ్మెల్యేలు విధిగా సమయానికి హాజరుకావాలన్నారు. టీఆర్ఎస్ కోటాలో రాజ్యసభకు వెళ్తున్న అభ్యర్థులను సీఎం ఎల్పీకి పరిచయం చేసారు.

బండప్రకాశ్, సంతోష్, లింగయ్య

పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగు లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ ముదిరాజ్ లు ఇవాళ  నామినేషన్ దాఖలు చేస్తారు.

టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థి, పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇవాళ ఉదయం 11 గం.ల 56 ని.లకు అసెంబ్లీ ఆవరణలో నామినేషన్ దాఖలు చేస్తారు.

ఆయనతోపాటు మిగిలిన ఇద్దరు సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ ముదిరాజ్ లు కూడా తమ తమ నామినేషన్లను దాఖలు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *