మోదీ కంటే గొప్ప హిందూత్వ వాది ఎవరబ్బా?

సాధారణంగా కొడుక్కి తండ్రి సంగతులు బాగా తెలుస్తాయి.
తెలంగాణ సిఎం కేసిఆర్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు ఆయన తనయుడు, మంత్రి కేటిఆర్. ఇలాంటి ఆసక్తి కరమయిన విషయాలను వెల్లడించేందుకు ఆయన ప్రెస్ వాళ్లతో చిట్ చాట్ చేస్తుంటారు.

శుక్రవారం మంత్రి కేటిఆర్ మీడియాతో ఇలా చిట్ చాట్ చేశారు. ఆ విషయాలు చదవండి.

కెసిఆర్ కు జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలు నాలుగు విప్లవాలు.
హరిత, నీలి, గులాబి, క్షీర విప్లమం తీసుకు రావడానికి  సీఎం కేసీఆర్  ప్లాన్ డీ చేసుకున్నారు.

 కౌలు రైతులతో  సమస్యలున్నాయి.

కౌలు రైతుకు పెట్టుబడి సాయం ఇస్తే  చాలా ఇబ్బంది. భూమిని ఎవరికి కౌలుకు ఇవ్వాలన్నది రైతు మీద ఆధారపడి ఉంటుంది. 12 సంవత్సరాలు కౌలుదారుగా ఉంటే హక్కుదారుగా అవుతారు. అందుకు ఏ రైతు ఒప్పుకోడు. లక్షల కేసులు కోర్టుకు వెళ్తాయి.

తెలంగాణ వైపు దేశం అంతా చూస్తోంది. తెలంగాణ విత్తన బాండాగారం అయిపోయింది. రైతులకు కావాల్సింది నీరు. దానికి సంబంధించి వాయు వేగంతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. గోడౌన్ లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాము. ఇంకా చేస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఫైనలైజ్ అయ్యాయి. నెక్స్ట్ క్యాబినెట్ లోకి వస్తుంది.

నిరుద్యోగ భృతి ఎలా ఇస్తారు?

కాంగ్రెస్ వాళ్లు ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో చెప్పాలని అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేదు. రైతు బీమా పథకం 6 లక్షలు అయ్యింది. రైతు ఆత్మహత్యలు జరగకూడదనేదే ప్రభుత్వ లక్ష్యం.
ప్రజలకు బ్యాంకుల మీద నమ్మకం పోయింది. వారి డబ్బులు వారు తీసుకోవడానికి ఈ లైన్లు ఏంది. రైతులకు బ్యాంకులు అప్పు ఇవ్వడానికి వెయ్యి ప్రశ్నలు వేస్తారు. విజయ్ మాల్యాను ఏమడిగి ఇచ్చారు లోన్. జీఎస్టీ వల్ల తెలంగాణ నష్ట పోయింది.

తెలంగాణ ఎన్నికలు 

తెలంగాణలో ఈ సారి ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయి. 100 శాతం ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే నేను రాజకీయాల్లో ఉండను. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎవరి నమ్మకం వారిది. ఉత్తమ్ కుమార్ అయినా, కోదండరాం అయినా బీజేపీ అయినా.

మోదీ కంటే హిందూత్వవాది

కర్ణాటక రాజకీయం బడితే ఉన్నోడిదే బర్రె అన్నట్లు ఉంది. హిందుత్వం మీద బీజేపీ కానీ మోడీ కానీ ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తే నడవదు. కేసీఆర్ కంటే హిందుత్వ వాది ఎవరున్నారు. మోడీ కంటే గొప్ప హిందుత్వ వాది కేసీఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *