పరిపూర్ణానంద బహిష్కరణ తప్పన్న కత్తి మహేశ్

స్వామి పరిపూర్ణానంద  హైదరాబాద్ నగరం నుంచి  బహిష్కరించాడాన్ని  దళిత మేధావి, ఫిల్మ్ క్రిటిక్  కత్తి మహేశ్ ఖండించారు.

కత్తి మహేశ్ ఇప్పటికే నగర బహిష్కరణలో ఉన్నారు.  ఈ దళితులనుంచి, ప్రజాస్వామిక వాదులనుంచి మహేశ్ బహిష్కరణ మీద విమర్శలు వెల్లువెత్తడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ  తెల్లవారు జామున స్వామి పరిపూర్ణానందను కూడా హైదరాబాద్ నుంచి ఆరునెలల పాటు బహిష్కరించింది. ఆయనను సొంతూరు కాగినాడు తరలించినట్లు చెబుతున్నారు.  ఈ చర్య మీద మహేశ్ స్పందించారు.

‘బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు.బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.మనుషుల్ని “తప్పిస్తే” సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది,’  అని ఆయన ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *