ఈ జూలై గత వందేళ్లలో ‘హాటెస్ట్ మంత్’

ఈ జూలైలో భూమి కనివిని ఎరుగనంతగా వేడెక్కింది. ఉష్ణోగ్రతలు రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎపుడులేనంతా ఈ జూలైలో ఉష్ణోగ్రత పెరిగిందని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ప్రకటిచింది.
భూమండలం మొత్తంగా అంటే భూమి ఉపరితలం మీద, సముద్ర ఉపరితలం మీద ఉష్ణోగ్రత 1.71 ఫారిన్ హీట్ (0.95 డిగ్రీ సెల్సియస్) ఎక్కువగా నమోదయింది. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రత 60.4 పారిన్ హట్ ( 15.8 డిగ్రీ సెల్సియస్). ఉష్ణోగ్రత రికార్డు చేయడం 1880లో మొదలయింది.
2016లో నార్మల్ కంటే 0.05ఫారిన్ హీట్ మాత్రమే ఎక్కువగా ఉండింది. మరొక వైపు అర్కిటిక్ అంటార్కిటక్ ప్రాంతాలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత పడిపోయిందని కూడా ఈ సంస్థ వెల్లడించింది.
ఈ శతాబ్దపు 10 హాటెస్టు జూలైలలో 9  2005 నుంచి  మొదలయ్యాయి. ఇందులో గత ఐదు జూలైలు మాత్రం అత్యధిక ఉష్ణోగ్రత చూపించాయి.
మరిన్ని వివరాలు NOAA లో అందుబాటులో ఉన్నాయి.