జిమ్ నుంచి రాగానే జాన్వీ కపూర్ పై ఎగబడ్డారు (వీడియో)

బాలీవుడ్ లో ఫేమస్ ఫిల్మ స్టార్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కు ఎంత క్రేజ్ ఉందో ఈ ఘటన చూస్తే తేలిపోతుంది. మరికొద్ది రోజుల్లో దడఖ్ అనే సినిమా రిలీజ్ కాబోతున్నది. ఆ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్నది. ఆమెకు ఇదే తొలి చిత్రం. ఇప్పుడు శ్రీదేవి ఫ్యాన్స్ అంతా జాన్వీ కపూర్ ఎలా నటిస్తుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.

ఇటీవల జాన్వీ జిమ్ నుంచి బయటకు వస్తుంటే అక్కడ ఉన్న వాళ్లు జాన్వీ చుట్టూ ఎలా ఎగబడ్డారో కింద వీడియోలో చూస్తే తెలుస్తుంది. యూత్ నుంచి పెద్ద వాళ్లు, పిల్లలు ఆమెను కలవాలని, ఆమెను తాకాలని, ముట్టుకోవాలని ఎంతగా ఎగబడ్డారో చూడండి.

ఈ సమయంలో కొద్దిగా పరిస్థితి అదుపు తప్పింది. పిల్లలు అందరూ ఆమెను చుట్టుముట్టేశారు. అయితే జాన్వీ ఏమాత్రం ఇబ్బంది పడలేదు. వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి సరదాగా నవ్వుతూ వెళ్లింది. ఆమె బాడీగార్డ్స్ అక్కడి నుంచి సేఫ్ గా తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే దడఖ్ సినిమాను నిర్మాత కరణ్ జోహార్ జూన్ 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. శశాంక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇషాన్ ఖతార్ హీరోగా నటించారు.

వైరల్ వీడియో కింద ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *