ఆంధ్రలో గవర్నమెంట్ వైన్ షాపులు, పరిశీలనకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపే వీలుంది.  ఈ విషయా న్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను అదేశించారు.  ఈ రోజు  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు.
రాష్ట్రంలో మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఇందులో  భాగంగా మొదట బెల్టు షాపుల మూసేసే విషయం పరిశీలించాలని ఆదేశించారు.
ప్రతి పేద వారి లో ఆనందం వెల్లివిరిసేందుకు బెల్ట్ షాపులను సమూలంగా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అవసరమైన పక్షంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి బెల్ట్ షాప్ ల వ్యవస్థను నిర్ములించాలని ఆయన సూచించారు. ఎక్కడయినా బెల్ట్ షాప్ కనిపిస్తే.. దానిపై చర్యలు తీసుకుంటూనే, దానికి మద్యం సరఫరా చేసిన వైన్ షాప్ లైసెన్స్ రద్దు చెయ్యాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
దశల వారి మద్యపాన నిషేధం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చైతన్యం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఎక్కడ అక్రమాలు జరిగినా మరింత కఠినతరమైన నిబంధనలు అమలు చేయాలని చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా 15వ ఆర్ధిక సంఘం ముందు సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ తన వాదన వినిపించాలి
ఆయన ఇంకా ఏమన్నారంటే…
రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను వివరిస్తూ సమగ్రమైన నివేదిక తయారు చేసి ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో కేంద్రానికి వివరించాలి
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత మెరుగు పరిచేలా చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
సామాన్యునిపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాలి.
ఈ దిశగా హరిత పన్ను (గ్రీన్ టాక్స్), వ్యర్థ పదార్థాలపై పన్ను, ఎర్ర చందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరయిన ఇసుక విధానం అమలు … వంటి చర్యలు ద్వారా ఆదాయాన్ని పెంచే యోచన చేయాలి.
కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీ పెట్టి, అప్పులు తీసుకుని, వాటిని దారి మళ్లించిన వైనాన్ని చూసి ఆయన నివ్వెరపోయారు.
ఎక్సయిజ్ శాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేవలం ప్రత్యేక ఆదాయ వనరులుగా చూడకూడదని చెప్పారు.
కుదేలైన ఆర్ధిక వ్యవస్థను మార్చేందుకు ఆర్ధిక క్రమశిక్షణ అందరు పాటించాలని సూచించారు.
అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్క దిద్దడానికి సృజనాత్మక ఆలోచన విధానాలతో రావాలని అధికారులకు సూచించారు.
సమీక్షద సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, రాష్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డీ.సాంబశివరావు, పీ.వీ.రమేష్, ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి కె.ధనంజయ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *