చంద్రబాబు స్కాములను ఒకటొకటే వెలికి తీస్తా…

మాజీ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కుంభకోణాలకు పాల్పడ్డారని, ఆయన స్కాామ్ లను ఒక్కొక్కటే వెలికితీస్తామని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఒక సంచలన వార్త వెల్లడించారు.

ఈ రోజు ఢిలీలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ తన పర్యటన విశేషాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇపుడు వోవర్ డ్రాఫ్ట్  పాలన సాగుతూ ఉందని చెబుతూ రాష్ట్రం అప్పుల వూబిలోపడిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

‘రాష్ట్రం విభజించే నాటికి 97 వేల కోట్లు అప్పులు మాత్రమే ఉంటే.  గడిచిన 5 ఏళ్లలో 2 లక్షల 57 వేల కోట్లకు అప్పులు ఎగబాకాయి.అప్పులకు వడ్డీనే 20 వేల‌ కోట్లు చేరుకుంది,’ అని జగన్ అన్నారు.

ఏపి రాష్ట్రం లోని పరిస్థితులపై ప్రధాని తో చర్చించానని, కేంద్ర సాయం ప్రస్తుతం రాష్ట్రానికి చాలా అవసరమని చెప్పినట్లు ఆయన తెలిపారు.

ఎన్డీఏ 250 స్థానాలకే పరితమై ఉంటే, కేంద్రం మీద వత్తిడి తీసుకురావలసిన   అవసరం తెలుగు రాష్ట్రాలకు ఇంతగా ఉండేది కాదు. ఎన్డీఏ బలం 250 దాటకూడదని చాలాగా దేవుణ్ని ప్రార్థించానని ఆయన చెప్పారు.

ప్రధానితో జరిగిన సమావేశంలో  ప్రత్యేక హోదా అనే ఒక్క అంశంపై పైనే సుదీర్ఘంగా చర్చ జరిగిందని అంటూ, ఎన్డీఏ కి పూర్తి బలం రాకుండా  ఉంటే ప్రత్యేక హోదాపై సంతకం పెట్టాకే ప్రధానిగా మోడి ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండేదని అన్నారు.

‘ప్రత్యేక హోదా మన హక్కు, ఈ హక్కును ఇప్పుడు వదిలేస్తే ఎప్పటికి రాదు. పిఎం ని కలిసిన ప్రతి సారి ప్రత్యేక హోదాపై ప్రధాని ని కోరుతూనే ఉంటా,’ అని చెప్పారు.

రాష్ట్రంలో మద్యపాన నిషేధం గురించి చెబుతూ  మళ్లీ  ఓట్లడిగే సమయానికి మద్యాన్ని 5 స్టార్ హోటల్ల కు పరిమితం చేశాకే ఓట్లు అడుగుతా ని అన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *