జానారెడ్డి, షబ్బీర్ ఆలీకి తెలంగాణ పోలీసుల నోటీసు

అసెంబ్లీ ఎన్నికల్లో బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ వాడుకున్నందుకు కాంగ్రెస్ నేతలు, గతంలో ప్రతిపక్షనేతలుగా ఉన్న కె జానారెడ్డి (అసెంబ్లీ), మహమ్మద్ అలీ షబ్బీర్ (కౌన్సిల్)లకు రు. 9లక్షల 860 చెల్లించాలని  తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ నోటీసులు జారీ చేసింది.

జానారెడ్డి 87రోజులు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడినందుకు కిలోమీటర్ కు రూ .37 , డ్రైవర్ బత్తా రోజు కు రూ .100 చొప్పున రూ .4.20,094 చెల్లించాల్సి ఉంటుంది.

ఇలాగే షబ్బీర్ అలీ 90 రోజులు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడుకున్నారు.  దీనికి గాను  కిలోమీటర్ కు రూ .37 , డ్రైవర్ బత్తా రోజు కు రూ .100 చొప్పున రూ .4,79,936 చెల్లించాలని నోటీసు జారీ చేశారు.

బుల్లెట్ ప్రూఫ్ వాహానాలు ఇంటెలిజెన్స్ శాఖ ఆధీనంలో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *