హైదరాబాద్ మెట్రో రైలు మళ్లీ ఆగిపోయింది

పారడైస్ సమీపంలోని స్టేషన్ వద్ద సాంకేతిక సమస్య తో ట్రాక్ పై అరగంటపాటు  హైదరాబాద్  మెట్రో రైల్ ఆగిపోయింది. దీనితో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసులకు పరిగెత్తే సమయంలో కావడంతో అందరిలో ఆందోళన మొదలయింది.మరమ్మత్తు చేసినప్పటికీ రైలు కదలలేదు. దీనితో  మరొక ట్రైన్ ని రప్పించి ఈ ట్రైన్ కి జాయింట్ చేసి అమీర్ పేట్ మెట్రో జంక్షన్ వరకు తీసుకువెళ్లారు.

అధికారల వివరణ
ఎలెక్ట్రికల్ ఫెయిల్యూర్ వల్ల ట్రెయిన్ ప్యారడైజ్ సమీపంలో ఉదయం 10.30 కి ఆగిపోయిందని అపుడు రైలును ప్రకాశ్ నగర్ స్టేషన్ వద్ద ఉన్న సైడ్ లైన్ లోకి మరొక రైలు సహాయంతో తీసుకురావడం జరిగిందని హైదరాబాద్ మెట్రలో రైలు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ప్యారడైజ్ వద్ద  ఆగిపోయిన రైలు నుంచి దింపి మరొక రైలులో ప్రయాణించే ఏర్పాటుచేసినట్లు  హెచ్ ఎమ్ ఆర్ ఎండి తెలిపారు.

‘There was an electrical failure in one train at Paradise station at around 10.30 am today. The train was pushed to the pocket track(siding) of Prakash nagar stn by another train & these two trains r there. Passengers were disembarked at Paradise station & were taken in the next train. The failed electrical part in the train is being repaired : MD.HMR’