హైదరాబాద్ ‘ఎగ్ డెన్‘ లోకి దూరారో, తిరిగి రాలేరు

(సుమబాల)

ఫుడ్ లవర్స్ లో ఎగ్ లవర్స్ డిఫరెంట్. ఎగ్ వెజా? నాన్ వెజా? అనే వాదన పక్కనపెడితే…నాన్ వెజ్ లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఎగ్ స్పెషాలిటీనే వేరు. అది ఎగ్ లవర్స్ కే తెలుసు. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్…లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ పక్కన బాయిల్డ్ ఎగ్ పెడితే…అటోమెటిక్ గా ఎగ్ వైపే చేతులు వెడతాయి. దటీజ్ ఎగ్ స్పెషాలిటీ. బిర్యానీలో లెగ్ పీస్ కోసం కాకుండా బాయిల్డ్ ఎగ్ కోసం ఫైట్ చేస్తారు ఈ ఎగ్ లవర్స్…సో ఇలాంటి ఎగ్ లవర్స్ కోసం హైదరాబాద్ లోని ఓయూ కాలనీలో ఏర్పటైందే ఎగ్ డెన్.

జనరల్ గా ఎగ్ లో మీరు ఎన్ని రకాలు ఊహిస్తారు? బాయిల్డ్ ఎగ్, ఎగ్ బుర్జీ, 5,6 రకాల ఆమ్లెట్స్, ఎగ్ నూడుల్స్…ఇంకా…ఇంకేముంటాయి అనిపిస్తుంది కదా…కానీ ఒక్కసారి ఎగ్ డెన్ మెనూ చూస్తే కళ్లు తిరగడం ఖాయం…నూరు  రకాల ఐటమ్స్ కనిపిస్తాయి. ఇంకా కొత్త కొత్త వి వచ్చి చేరుతున్నాయి.

అందులోనూ సూప్స్, అపిటైజర్స్, సలాడ్స్, స్నాక్స్, సిజ్లర్స్, పాస్తాస్, రైస్ నూడుల్స్, కర్రీస్, ఆమ్లెట్స్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్ తో సహా కంప్లీట్ మీల్. అంతేనా ఇటాలియన్, థాయ్, చైనీస్, అమెరికన్, ఇండియన్ క్యుజిన్ ఎగ్ స్పెషల్ వంటకాలూ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవే కాదు మొత్తంగా 500రకాల ఎగ్ వెరైటీలు వీరి దగ్గర ఉన్నాయి. వాటన్నింటినీ మెల్లమెల్లగా ఒక్కొక్కటీ ఇంట్రడ్యూస్ చేస్తారట.

ఆలోచన ఎవరిది

హైదరాబాద్ షాపూర్ నగర్ కి చెందిన సంతోష్ కుమార్ కి మార్కెటింగ్ అండ్ ప్రొక్యూర్ మెంట్ లో పది సంవత్సరాల అనుభవం. సహజంగా ఫుడీ. హైదరాబాద్ లో ఫుడ్ లవర్స్..వెరైటీ ఫుడ్ కి ఉండే క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. దీనికి తన ఫ్రెండ్స్ రవి, రాజేష్ లు పార్టనర్స్ గా మారారు. మొదట్లో హైటెక్ సిటీ చుట్టుపక్కల అంటే లంచ్ టైంలో సాఫ్ట్ వేర్ ఆఫీసులకు లంచ్ బాక్స్ అందించేలా ఏదైనా ప్లాన్ చేద్దామనుకున్నారు. దానికోసం ప్లేస్ వెతుకుతూ వెతుకుతూ ఓయూ కాలనీ వరకు వచ్చారు.

అయితే లంచ్ బాక్స్ ఐడియా కంటే ముందు ఎగ్ డెన్ వర్కవుట్ అయ్యింది. అయితే ఇదేమీ అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన కాదు. రెండేళ్లుగా సంతోష్ ఆలోచిస్తున్నదే. ఎగ్ స్పెషల్స్ కే ప్రత్యేకంగా ఒక రెస్టారెంట్ ఉండడం అనేది కొత్త ఆలోచన. దానికోసం రెండేళ్లు రీసెర్చ్ చేశారు.

అంత వీజీ కాదు

రీసెర్చ్ అంటే అంత మామూలుగా ఏమీ చేయలేదు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం కదా…నాన్ వెజ్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడేది చికెన్…దానికున్నంత క్రేజ్, ఫ్లో ఎగ్ ఐటమ్స్ కి ఉంటాయా? అనేది మొదటి సందేహం. సంతోష్ కి తన ఫ్రెండ్స్ కి నమ్మకం ఉన్నా…అదొక్కటే సరిపోదు కదా. అందుకే చాలామందిని కనుక్కున్నారు. అందరూ ఐడియా బాగుందని చెప్పినవాళ్లే. ఇక రెండో ఫేజ్ చెఫ్స్. ఎగ్ తో ఐటమ్స్ చేయడం…వాటిని కస్టమర్స్ మెచ్చేలా చేయడం…అంటే మాటలు కాదు. సో ఎంతో మంది చెఫ్స్ ని ఇంటర్వ్యూ చేశారు. మొదటి స్టేజ్ లో సెలెక్ట్ అయిన వారితో ఎగ్ తో రకరకాల వెరైటీస్ చేయించి…అవి బాగా చేసిన ఇద్దరు చెఫ్స్ ని సెలక్ట్ చేశారు. వీరిద్దరికీ ఫైవ్ స్టార్ హోటల్ నుండి వచ్చినవాళ్లే. సో…అన్నీ కలిశాయి. ప్లేసూ దొరికింది అంతే ఎగ్ డెన్ స్టార్ట్ అయ్యింది.

ఎక్కడ ఉంది

మణికొండ ఓయూ కాలనీలో ఐదునెలల క్రితం ఎగ్ డెన్ మొదలయ్యింది. చాలామందికి ఇదొక వెరైటీ ఎంటో చూద్దామని వస్తారు. ఒక్కసారి ఇక్కడ ఎగ్ ఐటమ్ రుచి చూశారంటే మళ్లీ మళ్లీ వస్తారు. మరి వారికోసం 80 రకాల ఐటమ్స్ ఎదురుచూస్తున్నాయి కదా.

 

చాలామంది ఇక్కడ స్నాక్స్ మాత్రమే దొరుకుతాయని అనుకుంటారని..అయితే ఇక్కడ కంప్లీట్ మీల్ దొరుకుతుందని సంతోష్ కుమార్ అంటున్నారు. ప్రస్తుతం మెల్లగా జనాల్లోకి వెళ్లింది. రెస్పాన్స్ చాలా బాగుంది. దీన్ని ఇంకా ఎక్స్ పాండ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నామని అన్నారాయన. అంతేకాదు ప్రాఫిట్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని..సక్సెస్ అయ్యింది కాబట్టి అవి వాటంతట అవే వచ్చేస్తాయని ధీమాగా చెప్పారాయన. సో ఎగ్ లవర్స్ ఈ సారి మణికొండవైపు వస్తే ఎగ్ డెన్ కి తప్పకుండా వెళ్లండి.కాంటాక్ట్ నెం. కె.సంతోష్ కుమార్, 8121115654,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *