టిడిపి కి వైసిపి ఎంపిల రాజీనామా తలనొప్పి

పార్లమెంటు ఏ రోజు వాయిదా పడుతుందో ఆదే రోజు వైసిపి ఎంపిలంతా రాజీనామా చేయాలని ఈ రోజు నిర్ణయించారు. ఇపుడు తెలుగుదేశం కూడా ఈవిషయంలో ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే, రాజీనామాల విషయంలో కలసి రావాలని పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చారు.
ఇంతవరకు టిడిపి అజండానే జగనే శాసిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా మీద చేస్తున్న క్యాంపెయిన్ ప్రభావంతో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు చివరకు హోదా డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు.

అంతేకాదు, హోదా ఇవ్వలేదు,ప్యాకేజీ ఇవ్వలేదంటూ ఇద్దరు మంత్రులను కూడా కేంద్ర క్యాబినెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు, ఆపైనా యుపిఎ నుంచి వైదొలిగారు. వైసిసి మోదీ ప్రభుత్వం మీద ఆవిశ్వాసం తీర్మానం పెడితే, టిడిపి తాను కూడా అవిశ్వాసం తీర్మాణం పెట్టింది. ఇపుడు వైసిసి ఎంపిలు, ఏప్రిల్‌ 6 కన్నా పార్లమెంటు ముందే నిరవధికంగా వాయిదాపడితే అదే రోజే ఎంపీలు లోక్‌సభకు రాజీనామాచేయాలని నిర్ణయించారు.

వైయస్‌ జగన్‌ అధ్యక్షతన గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్లలో ప్రజాసంకల్పయాత్ర శిబిరంలో పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇపుడు టిడిపి రియాక్షన్ చూడాలి. వైసిపికి ఉన్న ఏడుగురు ఎంపికలలో ఇద్దరు టిడిపిలోకి వెళ్లారు. ప్రస్తుతం అయిదుగురు మాత్రమే ఉన్నారు. సమావేశం వివరాలను ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. సమావేశం జగన్ చెప్పిన విశేషాలు :
– రాజీనామాలన్నీ స్పీకర్‌ ఫార్మాట్‌లోనే ఇవ్వాలి : వైయస్‌ జగన్‌
– ఏ విషయాన్నైనా దాపరికంలేకుండా మనం ప్రజలముందు ఉంచుతున్నాం: వైయస్‌ జగన్‌
– రాజీనామాల ప్రకటన నుంచి అవిశ్వాసం వరకూ మనం నిర్ణయాలన్నీ చిత్తశుద్ధితో తీసుకున్నాం: వైయస్‌ జగన్‌
–వాటిని నేరుగా ప్రజలముందే ఉంచుతున్నాం : వైయస్‌ జగన్‌
–ప్రత్యేక హోదా సాధనకోసం కేంద్రంపై ఒత్తిడి, ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దేశవ్యాప్తంగా చర్చజరగాలన్నదే మన ఉద్దేశం : వైయస్‌ జగన్‌
–మనం రాజీనామాలు ప్రకటించినప్పుడు, అవిశ్వాసం పెడతానన్నప్పుడు చంద్రబాబు ముందుకురాలేదు : వైయస్‌ జగన్‌
– విధిలేని పరిస్థితుల్లో వారుకూడా అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది: వైయస్‌ జగన్‌

– ఏది ఏమైనా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఒక నిర్ణయం విషయంలో ముందుకు వస్తే.. దానివల్ల వచ్చే ఒత్తిడి, తీవ్రత వేరేలా ఉంటుంది: వైయస్‌ జగన్‌
– ఇప్పుడు కూడా రాజీనామాల విషయంలో కలిసి రావాలని టీడీపీని కోరుతున్నాం: వైయస్‌ జగన్‌
– రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఒకేతాటిపైకి వచ్చి రాజీనామాచేస్తే.. దాని తీవ్రత ఎక్కవ ఉంటుంది. కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది: వైయస్‌ జగన్‌
– ఇక్కడ బేషజాలకు, ఎవరు ముందు, ఎవరు వెనుక అనే చర్చలోకి పోవాల్సిన అవసరంలేదు: వైయస్‌ జగన్‌
– అవిశ్వాసంపై గట్టిగా పట్టుబట్టండి : వైఎస్‌ జగన్‌
– అందర్నీ కలుపుకు వెళ్లండి : వైఎస్‌ జగన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *