తాపీ మేస్త్రీ కొడుకు…. “కవితా” రచనలల్లో ఘనుడు

ఆయన కవిత్వానికే వన్నె తెచ్చాడు.  ప్రతి అక్షరంలో విలువైన అర్ధం. కవిత్వమే తన శ్వాసగా, ధ్యాసగా బతుకుతున్నాడు. సమాజంలో జరిగే అన్యాయం పై ఎలుగెత్తి గళమెత్తుతున్నాడు. చిన్నతనం నుంచే కవిత్వంలో తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నాడు.

అక్రమాలను ప్రశ్నిస్తూ, అన్యాయాలను ఎదురిస్తూ గర్జిస్తున్నాడు. తాను పేద కుటుంబంలో పుట్టినా కళకు కాదు ఏది అడ్డంకి అని నిరూపించాడు. సుప్రసిద్ద కవుల నుంచి ఎన్నో బహుమతులు తీసుకున్నాడు. అతనే పల్లెర్ల రమేష్ అలియాస్ అంబాల రమేష్.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండలం అంబాల గ్రామం. ఈ గ్రామంలో పల్లెర్ల యాదయ్య, మణెమ్మ  దంపతుల పెద్దకొడుకు రమేష్. రమేష్ 1 వ తరగతి నుంచి 7 వ తరగతి వరకు అంబాల పాఠశాలలో చదువుకున్నాడు. అతను కవిత్వాలు రాస్తాడని ముందుగా రాయల్ సారు గమనించాడు. అతనిని ప్రోత్సహించాడు.దీంతో రమేష్ రెట్టింపు ఉత్సాహంతో తన కలకు పదును పెట్టాడు. రమేష్ పాటలు కూడా పాడుతాడు.

టెన్త్, ఇంటర్, డిగ్రీ మోత్కూరులో పూర్తి చేశాడు. డిగ్రీలో అన్వర్ సర్ రమేష్ కు సహాయ సహాకారాలు అందించి ప్రోత్సహించాడు. డిగ్రీలో తన మిత్రుడు సతీష్ కూడా రమేష్ బాగా సహాకరించి నేను నీ వెంట ఉన్నానని దైర్యం చెప్పాడు. దీంతో రమేష్ కూడా అంతే ఉత్సాహంతో ముందుకు సాగాడు.

రమేష్ తల్లిదండ్రులు చాలా పేదవారు. రమేష్ తండ్రి తాపీ మేస్త్రీ పని చేస్తుంటాడు. తల్లి కూలి పనులకు వెళుతుంది. వారికి పూట గడవడమే కష్టమైనా వారు తమ కొడుకులో ఉన్న టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించారు. దీంతో రమేష్ ఓ వైపు చదువుతూ మరో వైపు తన కవిత్వానికి పదును పెడుతూ తన కలం నుంచి ఎన్నో కవితలను జాలువార్చారు.

రమేష్ కలం నుంచి వందల కవితలు వెలువడ్డాయి. పుస్తకాల రూపంలో కూడా రమేష్ కవితలు వచ్చాయి. రమేష్ కు ఆర్దికంగా ఇబ్బంది కావడంతో లక్ష్య సాధన ఫౌండేషన్ చైర్మన్ రాజు సహాకరించారు. రాజన్న లేకపోతే తాను లేనని రమేష్ అందరికి చెప్తుంటాడు. “హృదయ స్పందన, జీవన పోరాటాలు” అనే పుస్తకాలలోని రచనలకు రమేష్ కు మంచి పేరు వచ్చింది.

రమేష్ 14వ ఏట రాసిన “నవ్వే నవ్వే నవ్వేద్దాం”  అనే కవితను రాసి పాటగా మార్చడంతో అప్పుడు ఈ పాట బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచే రమేష్ తన కవితలను రాయడం మొదలుపెట్టారు. చిన్న పిల్లల పై జరిగే అఘాయిత్యాల పై రాసి కరపత్రాలు పంచి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. నందిని సిదారెడ్డి, సుద్దాల అశోక్ తేజ, మంత్రులు ఇతరులతో అనేక అవార్డులను ప్రశంసా పత్రాలను రమేష్ అందుకున్నాడు.

రమేష్ కు ఉత్తమ ప్రతిభ ఉన్నా ఆర్ధికంగా ఇబ్బందులు ఉండడంతో ముందుకు వెళ్లలేకపోతున్నాడు. కళాధాములు, ప్రభుత్వం తనకు సహాయం చేయాలని వేడుకుంటున్నాడు. ప్రస్తుతం ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నానని, ప్రభుత్వం తెలుగు భాషా రంగంలో ఉద్యోగం కల్పిస్తే తాను పని చేసుకుంటూ, కవిత్వాలను కూడా రాస్తానని రమేష్ అంటున్నాడు. ప్రభుత్వం, అధికారులు, కళా రంగ ప్రముఖులు రమేష్ కు ఆర్ధిక సహాయం అందించాలని పలువురు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *