Home English ‘హల్ చల్’ సినిమా సెన్సార్ పూర్తి, నవంబర్ లో విడుదల..

‘హల్ చల్’ సినిమా సెన్సార్ పూర్తి, నవంబర్ లో విడుదల..

SHARE

రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం హల్ చల్. శ్రీపతి కర్రి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా హల్ చల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెన్సార్ సభ్యుల నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకుంది ఈ చిత్రం. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భరత్ మధుసూదనన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలో ప్రత్యూష కొల్లూరి సమర్పిస్తుండగా గణేష్ కొల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు:
రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ..

సాంకేతిక నిపుణులు:
రచన దర్శకుడు: శ్రీపతి కర్రి
నిర్మాత: గణేష్ కొల్లూరి
సమర్పణ: ప్రత్యూష కొల్లూరి
నిర్మాణ సంస్థ: శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్
కో ప్రొడ్యూసర్: సుజాత బిజిగిరి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
సంగీతం: భరత్ మధుసూదనన్
PRO: వంశీ శేఖర్