Home English తెలంగాణలో చరిత్ర పునరావృతం కాబోతున్నది… ఇలా!

తెలంగాణలో చరిత్ర పునరావృతం కాబోతున్నది… ఇలా!

263
0

మంచికో చెడుకో చరిత్ర ఎపుడూ పునరావృతం అవుతూ ఉంటుంది.ముఖ్యంగా రాజకీయాల్లో చరిత్ర రెగ్యులర్ గా పునరావృతం అవుతూ ఉంటుంది.ఇందులో సిగ్గుపడాల్సిందేమీ ఉండదు.
ఫిబ్రవరి 12,2016 న ఏమి జరిగిందో మరొక సారి అదే జరుగబోతున్నది. అంటే, చరిత్ర తెలంగాణలో మరొక సారి మనకళ్ల ముందు కదలాడబోతున్నది.

ఆ రోజు తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి షాకిచ్చారు. ది. టిఆర్ ఎస్ లో చేరిన టిడీపీ శాసనసభ్యులు మాదే అసలైన టిడిపి శాసన సభా పక్షం అని చెప్పి ఇక మేం మాయిష్టమొచ్చిందిచేసుకుంటామని అని అంటూ రూలింగ్ పార్టీలో టిఆర్ ఎస్ లో విలీనమవుతున్నామని ప్రకటించారు.

అవకాశమున్నపుడల్లా టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలంతా స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. శాసనసభలో టీడీపీ పక్షం విలీనం చేశాం అంగీకరించండని స్పీకర్ కు లేఖ రాశారు.

2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, వా ళ్లో పది మంది గోడ దూకి టిఆర్ ఎస్ లోకి వచ్చారు. తమదే అసలయిన శాసనసభా పక్షంఅని చెబుతూ సమావేశం నిర్వహించారు.టిడిఎల్ పిని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని ఒక తీర్మానం చేశేశారు.

తమ తీర్మానం మేరకు రాజ్యాంగంలోని 10 వ షెడ్యూలు పేరా 4 ప్రకారం తమని టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా పరిగణించాలని కోరారు. .స్పీకర్ కు అందజేసిన లేఖలో తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తీగల కృష్ణారెడ్డి, జి.సాయన్న, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవరపు కృష్ణారావు, కేపీ వివేకానంద, చల్లా ధర్మారెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్ సంతకాలు చేశారు. ఇంకే ముంది. స్పీకర్ కాదనగలరా. (కాదని ఉంటే అపుడుకష్టాలొచ్చాయి. కాదనలేక ఇపుడు కష్టాల్లో ఉన్నారు ఇదే వేరే విషయం. స్వీకర్లు ఓడిపోతున్నారీ మధ్య)

ఇదే చరిత్ర మళ్లీ తెలంగాణ అసెంబ్లీలో తొందర్లో కనిపించబోతున్నది. మరికొందరు శాసన సభ్యులు రెండు, మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు . అసెంబ్లీ ఎన్నికల తర్వాత పది మంది ఎమ్మెల్యేలు టిఆర్ ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఇపుడు మరొక ముగ్గురు శాసనసభ్యుల నుంచి అధికార పార్టీకి సంకేతాలు అందాయని తెలిసింది. రూలింగ్ పార్టీతో వీరికి డీల్ కుదిరిందని రేపో మాపో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమావేశమయిన కండువా కప్పుకుంటారని తెలిసింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 19 స్థానాలలో గెలిచింది. ఇందులో 10 మంది పార్టీ ఫిరాయించారు, వారి పేర్లు : సబితా ఇంద్రా రెడ్డి (మహేశ్వరం) జాజాల సురేందర్‌ (ఎల్లారెడ్డి), రేగ కాంతారావు (పినపాక), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), హరిప్రియ (ఇల్లందు), వనమా వెంకటేశ్వర్‌రావు (కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌) దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్‌), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌).

ఇపుడు ఇంకొక ముగ్గురు చేరితే ఫిరాయింపుదారుల సంఖ్య కాంగ్రెస్‌ బలంలో మూడింట రెండొంతులవుతుందని, అప్పుడు ఒక సమావేశం ఏర్పాటుచేసి, తామే నిజమయిన కాంగ్రెస్ శాసనసభా పక్షమని ప్రకటిస్తారు. ఆ కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని రూలింగ్ టిఆర్ ఎస్ లో విలీనం చేస్తున్నట్లు ఒక తీర్మానం చేస్తారు. దీనిని స్పీకర్ పంపి తమ విలీనాన్ని ఆమోదించి, రాజ్యాంగంలోని 10 వ షెడ్యూలు పేరా 4 ప్రకారం తమని టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా పరిగణించాలని కోరతారు.

దీని ఉద్దేశం తెలంగాణను కాంగ్రెస్ ముక్త తెలంగాణ గా చేయకపోయినా, కాంగ్రెస్ ముక్త అసెంబ్లీగా నయినా చేయడమే. కాంగ్రెస్ ఫిరాయింపు దారుల విలీనంతో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా పోతుంది. అపుడు సభలో మాట్లాడే హక్కు ఇస్తే ఇవ్వొచ్చు లేక పోతే లేదు. కాంగ్రెస్ ఉన్నా లేనట్లే.
ఇక సభలో 91 మంది శాసన సభ్యుల టిఆర్ ఎస్ బలం, 105 కు చేరుతుంది.

Read this aslo :

గెల్చితే కష్టాలు, ఓడితే నష్టాలు… చ్ఛీ , పాడు జీవితం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here