షాకింగ్ న్యూస్, ఫ్రాన్స్ లో ముందే కరోనా? అది చైనా సరుకు కాదు : శాస్త్రవేత్తలు

 (TTN Desk)
కరోనా వైరస్ అనేది చైనా లోని వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బల్ల గుద్ది రోజు చెబుతున్నారు. మొదట్లో ఆయన ఇలా సైగ చేస్తూ వచ్చారు. ఇపుడాయన బల్లగుద్ది చెప్పడమే కాదు, తన దగ్గిర ప్రూఫ్  కూడా ఉందంటున్నారు. ఫ్రూఫేమిటో బయటపెట్టడం లేదు. ఆ తర్వాత ఈ అధారం లేని సమాచారాన్ని ఆయన క్యాబినెట్ మంత్రులు కూడ అదే పనిగా ఊదరగొడుతున్నారు. తొందర్లో రానున్న అధ్యక్ష పదవి ఎన్నికల నాటికి తనని తాను  హీరోని చేసుకునేందుకు ట్రంప్ నోటికి వచ్చినట్లు వాగుతున్నారని చైనా ఆరుస్తున్నది.
అయితే చాలా మంది శాస్త్రవేత్తలు, చివరకు అమెరికా నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు నావెల్ కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి తప్పించుకుని వచ్చిందనే వాదనను కొట్టి వేస్తున్నారు.
కొందరైతే, చైనా వూహాన్ వైరాలజీ ల్యాబ్ లో జరుగుతన్న పరిశోధనలకు, ఇప్పడు ప్రపంచ చర్చించుకుంటున్న నావెల్ కరోనా వైరస్ కు సంబంధం లేదని, ట్రంప్ కు సైన్స్ కంటే రాజకీయాలు ముఖ్యమని, అందుకే ఆయన నోటి వచ్చినట్లు వాగుతున్నారని చెబుతున్నారు.

https://trendingtelugunews.com/english/trending/liquor-consumption-during-lockdown-affects-immunity-dr-eas-sarma/

ఈ వివాదం ఇలా సాగుతున్నపుడే పారిస్ శాస్త్రవేత్తలు నావెల్ కరోనా వైరస్  గురించి మనకు తెలిసిన అవగాహనను తారుమారు చేసే షాకింగ్ విషయాలు బయటపెట్టారు.
వాళ్లు చెప్పిందేమిటంటే, అధికారికంగా యూరోప్ లో, ఆమెరికాలో నావెల్ కరోనా వైరస్ (covid-19 లేదా SARS-COV-2) సోకిందనే ప్రకటన వెలువడటానికి ముందే అక్కడ కరోనావైరస్ ఉందని, అది జనంలో పాకుతూ వెళ్లిందని అంటున్నారు.  అధికారికంగా కరోనా నిర్ధారణ విషయం తెలిసేటప్పటికి అది బాగా ముదిరిపోయి, మరణాలు ఎక్కువయ్యాయని అంటున్నారు.
జనవరి మధ్యలో అమెరికాలో కరోనా కేసును నిర్ధారించారు. అయితే, అప్పటికి ముందే దేశంలో కరోనా వ్యాప్తిస్తూ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల కరోన వైరస్ ఎలా ఎపుడు  అమెరికాలో వ్యాపించిందనేది కనిపెట్టేందుకు పాత ఇన్ ఫ్లుయంజా వంటి కేసుల శాంపిళ్ల మీద కరోనా పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నట్లు CNN  రాసింది.
చైనానుంచి కరోనా కేసులు రావడానికి ముందే యూరోప్ కరోనా వైరస్ పాకుతూ వెళ్లి చాలా మందిలోకి ప్రవేశించిందని పారిస్ శాస్త్రవే త్తలు చెప్పడం షాకింగ్ న్యూసే. ఈ శాస్త్రవేత్తల బృందం ఆషామాషీగా చెప్పడం  లేదు. అంతర్జాతీయ ప్రమాణాలున్న పరీక్షలన్నీ జాగ్రత్త గాచేసి,వాటికి మళ్లీ ధృవీకరణ పరీక్షలు చేసుకుని అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధన వేదిక ఎక్కారు.
చైనా కరోన వార్త  రావడానికి ముందే యూరోప్ లో కరోనా కనిపించిందనే విషయాన్ని వారు డిసెంబర్ లో ఫ్లూ వంటి  జబ్బుతో ఆస్పత్రిలో చేరిన రోగుల నుంచి సేకరించిన ముక్కు రసి (నేజల్ స్క్వాబ్) నమూనాలను పరీక్షించి చెబుతున్నారు. అది కోవిడ్ -19 అని కొనుగొన్నారు.అంతేకాదు, చైనా తో సంబంధం లేకుండా 2019 డిసెంబర్ నాటికి కరోనావైరస్ ఫ్రెంచ్ జనాభాలో వ్యాపిస్తూ ఉందని కూడా వారు చెబుతున్నారు.
South China Morning Post రిపోర్టు ప్రకారం  చైనాలో మొదటి COVID-19 కేసు 2019,నవంబర్ 17న కనిపించింది. హుబే రాష్ట్రానికి చెందిన 55 సంవత్సరాల వ్యక్తిలో ఈ వైరస్ కనిపించింది. తమాషా ఏమిటంటే ఇతనికి వూహాన్ లోని చేపలమార్కెట్ కి సంబంధమేమిలేదు.
తమ పరిశోధన ఫలితాలను ఫ్రెంచ్ డాక్టర్లు  “SARS-COV-2 was alaready spreading in France in late December 2019”  శీర్షిక తో బాగా ప్రాచుర్యం పొందిన International Journal of Antimicrobial Agents (IJAA) అనే జర్నల్ లో  ప్రచురించారు.

Like this story? Share it with a friend!

 ఈ పరిశోధనా పత్రం రాసిన శాస్త్రవేత్తల పేర్లు A Deslandes, V Berti,  Y Tandjaoui-Lambotte MD, Chakib Alloui MD, E Carbonelle MD, PhD, JR Zahar MD PhD, S Brichler MD PhD, Yves Cohen MD PhD.
ఈ  పరిశోధకులంతా Groupe Hospitalier Paris Seine చెందిన డాక్టర్లు.  పారిస్ నగర శివారులోని Saint-Denis లోని ఆసుపత్రి వారి పరిశోధనా కేంద్రమయింది. ILI (Influenza-like-illness) తో బాధపడుతూ వచ్చి 2019 డిసెంబర్ 2 నుంచి 2020 జనవరి16 మధ్య  ఇక్కడి ఐసియు (ICU)లో చేరిన వారి మెడికల్ రికార్డులను వీరు పరిశీలించారు. వీళ్లందరికి నెగటివ్ RT-PCR పరీక్ష  కూడా చేశారు.  వీళ్లరెస్పిరేటరీ శాంపిల్స్ ను ధర్మో సైంటిఫిక్ -86 డిగ్రీల సెంటిగ్రేడ్ ఫ్రీజర్ లో  మైనస్ 80 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద భద్రపరిచారు.  భవిష్యత్తలు అవసరమయితే పరీక్షలకు వినియోగించుకునేందుకు వీలుగా వీటిని నాలుగేళ్ల పాటు భద్రపరిచే ఏర్పాట్లు చేశారు. ఈ రోగులంతా జ్వరంతో ( 35 డి.సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా)దగ్గు, జలుబు,గొంతురాపిడి(Myalgia)తో బాధపడుతూ ఆసుప్రతికి వచ్చారు.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/english/trending/ap-govt-destroying-mangroves-for-housing-scheme-pedalandariki-illu/

కరోనా అంతర్జాతీయ వివాదం నేపథ్యంలో పారిస్ డాక్టర్లు పాత శాంపిల్స్ ను పరీక్షించారు. 2020 ఏప్రిల్6-9 మధ్య 14 శాంపిల్స్  RT-PCR పరీక్షలు నిర్వహించారు.  కచ్చితమయిన ప్రమాణాలు పాటిస్తూ  SARS-COV-1, SARS-COV-2 ల కోసం అన్వేషణ జరిపారు. ఈ ఫలితాలు జీన్ ఫైండర్, ఐఎఫ్ ఎం ఆర్ ద్వార ధృవీకరించుకున్నారు. చివరకు తేలిందేమింటే…
పరీక్షించిన 14 శాంపిల్స్ ఒకరు కోవిడ్-19 పాజిటివ్. ఈ రోగి నిజానికి చైనాకు వెళ్లినవాడు కాదు. చైనాకు వెళ్లివచ్చిన వారితో కలసిన హిస్టరీకూడా లేదు. 42 సంవత్సరాల ఈ రోగి అల్జీరియా దేశస్తుడు. అతని ప్రయాణించిందంతా పారిస్ నుంచి అల్జీరియాకే. అది కూడా 2019 ఆగస్టులో.  చాలా కాలంగా అతను పారిస్ లో ఉంటూ చేపల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆస్తమా, మధుమేహం మాత్రమే  అతని మెడికల్ హిస్టరీ. నాలుగు రోజుల పాటు తీవ్ర జ్వరంతో, దగ్గు, తల నొప్పి  తో బాధపడటంతో అతన్ని 2019 డిసెంబర్ 27న ఎమర్జీన్సీ వార్డుకు తరలించారు. అపుడు అతని గల్లలో ఎలాంటి కొత్త రోగ కారకాలు (pathogen) కనిపించలేదు. తర్వా త అతన్ని యాంటి బయోటిక్ థెరపీ కోసం ఐసియు కు తరలించారు. అతని  పరిస్థితి మెరుగుపడింది. 2019 డిసెంబర్ 29న డిశ్చార్జ చేశారు.
దీనితో , జనవరిలో అధికారికంగా కోవిడ్ -19 రోగిని ఫ్రాన్స్ ప్రకటించడానికి ముందే దేశంలో కరోనావైరస్ సోకిన విషయం తమ పరీక్షల్లో కనిపించిందని ఈ డాక్టర్లు చెబుతున్నారు. చైనా, ఇటలీలో కరోనా రోగుల క్లినికల్ లక్షణాలను, రేడియోలాజికల్ స్వరూపాలనే  ఆసుపత్రిలో చేరినపుడు ఈ రోగిలో కనిపించాయనివారు చెప్పారు.
Identifying the first infected patient is of great epidemiological interest as it changes dramatically our knowledge regarding SARS-COV-2 and its spreading in the country. Moreover, the absence of a link with China and the lack of recent travel suggests that the disease was already spreading among the French population at the end of December 2019 అని వారు తమ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.
ఫ్రాన్స్ లో SARS-COV-2 ఎపుడుకాలుమోపింది,  2019 చివర్లో, 2020 ఆరంభం నాటికి ఫ్రాన్స్ భూభాగం మీద  ఇది ఏమేరకు నిజంగా వ్యాపించింది, ఎంత మంది ప్రజలు మనకు తెలియకుండా SARS-COV-2 తో చనిపోయారనేది తెలుసుకోవలసినఅవసరం ఉంది, దీని మీద మరింత లోతైన పరిశోధన జరగాలని వారు పేర్కొన్నారు.

Article source: sciencedirect.com