వైసిపికి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై, టిడిపి కౌంటర్ ఎటాక్

తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో దిట్ట. ఈ సారి ఆయనకు చాలా తీవ్రమయిన ఎత్తులు ఎదుర్కొంటున్నారు

వైసిపి నుంచి. చాలా పకడ్బందీగా వైసిసి తెలుగుదేశం మీద సైకలాజికల్ వార్ మొదలు పెట్టింది. పెద్ద ఎత్తున టిడిపి ఎంపిలను, సీనియర్ లీడర్లను లాగేసుకుని టిడిపి ఖాళీ అవుతున్నదన్న ఇంప్రెషన్ ఇస్తున్నారు. అయితే, చంద్రబాబు కూడా దీనికి అదే రీతిలో కౌంటర్ ఇస్తూ అసంతృప్తితో ఉన్న వైసిపినేతలను టిడిపిలోకి లాక్కుంటున్నారు.

ఇపుడు ఎన్నికల నగారా మోగాక  ఆయన జోరు పెంచినట్లు కనిపిస్తుంది.

తాజాగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ కృష్ణ ను టిడిపిలోకి లాక్కున్నారు.  మురళీ కృష్ణ తన మంది మార్బలంతో నిన్న టీడీపీ తీర్థం  పుచ్చుకున్నారు.  ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో ఘంటా మురళీ కృష్ణకి పసుపు కండవా కప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు  పార్టీలోకి  ఆహ్వానించారు. మురళీ చింతలపూడి ఏరియాలో బాగా పలుకుబడి ఉన్న నాయకుడే.ఆయనకు మంచిపేరు కూడా ఉంది. పాలోయింగ్ కు డోకా లేదు.

మురళీ కృష్ణతో పాటు ఘంటా సత్యంబాబు, బొప్పన అంజయ్య, టి.లక్ష్మయ్య, కేశవరావు, సుబ్బారావు, బొల్లినేని శ్రీనివాసరావు, వెల్ది కృష్ణమూర్తి, పెండ్యాల ప్రసాద్ టీడీపీ కండువా భుజానేసుకున్నారు.

2014 ఎన్నికల అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే అయిన మురళీ వైసీపీలో చేరారు.   మురళీ కృష్ణకి  ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి వైసిపి చాలా అట్టహాసం చేసింది. కొత్తలో ఉన్న మోజు ఇపుడు ఆయన మీద లేదు. ఈ మధ్య ఆయనను ఖాతరు చేయడం లేదు. దానితో ఆ పార్టీకి రిజైన్ చేసి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారినపుడు నేతలు మాట్లాడే భాషలోనే మాట్లాడారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాాయుడు రాష్ట్రంలో  చేసిన అభివృద్ధిని చూసే తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడ్ని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని ఆయన శపధం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *