కుప్పంలోనే చంద్రబాబుకు షాక్.. జగన్ 3 రాజధానులకు మద్దతు

(కోపల్లె ఫణికుమార్)
ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాష్ట్రమంతా తిరుగుతుంటే సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలోనే షాక్ తగిలింది.
జగన్ ప్రతిపాదనకు మద్దతుగా ఆదివారం కుప్పంలో భారీ ర్యాలి జరిగింది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు మీద పోటి చేసి ఓడిపోయిన వైసిపి అభ్యర్ధి చందమ్రౌళి కొడుకు భరత్ ఆధ్వర్యంలో ఈ ర్యాలి జరిగింది.
రాజధానులు మీద అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రమంతా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. చంద్రబాబు ఆలస్యంగా నైనా సరే అమరావతి బయట పర్యటించాలనుకుంటున్నారు. ఇపుడు చంద్రబాబు ఇలాకాలోనే వైసిసి ఇలా జండా ఎగరేసింది.
అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు సొంత నియోజకవర్గం,అందునా ఎప్పటినుంచి ఒటమి లేకుండా గెలిపిస్తున్న నియోజకవర్గం లోనే జగన్ కు మద్దతుగా ర్యాలి జరగటం.  ఆశ్చర్యంగా ఉంది కదూ.
నిజానికి రాష్ట్రానికి ఓ మూలగా అంటే కర్నాటక-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబుతో సహా ఎవరూ పట్టించుకోరు.
అభివృద్దికి ఆమాడ దూరంలో ఉండే ఈ నియోజకవర్గంలో ఏమి జరిగిన బయటకు పెద్దగా తెలీదు. అందుకనే చంద్రబాబు ఏకపక్షంగా కుప్పం నుండి వరుసగా గెలుస్తునే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంచుకోవడం లొనే ఈ మతలబు ఉంది.
అలాంటిది వైసిపి ఈ నియోజకవర్గం మీద కన్నేవసింది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గం మీద దృష్టి నిలిపి  చంద్రబాబుకు అపోజిషన్ సమీకరించింది.
దాని పర్యవసానంగానే మొన్నటి ఎన్నికల్లో మొదటి మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపులో చంద్రబాబు వెనుకబడ్డారు.  దానికి తోడు వైసిపి అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ నియోజకవర్గంలో గెలవలేకపోయినా  వైసిపి ఉనికైతే చాటుకుంటోంది. ఇందులో భాగంగానే మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలి జరగటం.
ఒకవైపు జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తు చంద్రబాబు జోలెపట్టి రాష్ట్రమంతా తిరుగుతుంటే కుప్పంలోనే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు ర్యాలి జరగటమే విచిత్రం. అఫ్ కోర్స్ ఇది రాజకీయ ప్రేరేపితమైన ర్యాలినే అనుకుంటే చంద్రబాబు చేస్తున్నది కూడా రాజకీయమే. ఒకవైపు చంద్రబాబు రాజకీయం చేస్తుంటే అదే స్ధాయిలో వైసిపి కూడా రాజకీయం మొదలుపెట్టింది. రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలన్నట్లుగా కుప్పంలోనే చంద్రబాబుకు వ్యతిరేకంగా భారీ ర్యాలి జరగటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.