చైనా మీద అంత ద్వేష భావం పనికిరాదు : రాఘవ శర్మ

(అభిప్రాయం)
(ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి దేశంలోని ఒక వర్గం చైనా మీద ద్వేష భావం నూరిపోస్తూఉంది. ఇపుడున్న అంతర్జాతీయ సంబంధాల మధ్య అంత ద్వేష భావం పనికిరాదని ప్రముఖ రచయిత అలూరు రాఘవ శర్మ అంటున్నారు.)
చైనా పట్ల ద్వేష భావం సరికాదు. కరోనా వైరస్ ను చైనా సృష్టించ లేదు. ఏ దేశస్థులు ఆలా చేయరు. మనుషుల పట్ల గౌరవం అవసరం. వాళ్ళు తొలి బాధితులు.
బాధితుల పట్ల సానుభూతి అవసరం. మనకు, చైనాకు మధ్య ఏర్పడిన సరిహద్దు సమస్య వల్ల 1962 లో యుద్ధం జరిగింది. మనం ఓడిపోయం.ఇది పాత బడింది కూడా.
ఓడినవాడు యుద్ధ భూమిలోనే ఏ డు స్తీ, గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏ డుస్తాడు. అన్నదమ్ముల మధ్యనే భూ తగాదాలు, సరిహద్దు తగాదాలు ఉంటాయి. విజ్ఞత ఉంటే చర్చల ద్వారా పరిష్కరించు కుంటారు. విజ్ఞత లేకపోతే ఒకరినొకరు న రుక్కుంటారు. ఇదే జరిగింది మనమధ్య.
ఇది సరికాదు. నరుక్కోడమే సరి అయితే, ఈ భూమి మీద మానవ జాతి ఎప్పు డో అంతరించేది. ద్వేషం మనిషిని దహించి వేస్తుంది. చాలా దేశాల మధ్య సరిహద్దు తగాదాలు వల్ల చాలా యుద్ధాలు జరిగాయి. అంతమాత్రాన వారు ఆగర్భ శత్రువులు కానవసరం లేదు.
నేను 2015 లో చైనా వెళ్లి వచ్చాను. భారతీయులు అంటే  వారు చాలా గౌరవిస్తారు. మన రవీంద్ర నాథ్ టాగూర్ పేరు అక్కడ బాగా పాపులర్ . ఆయనకు నోబెల్ వస్తే తమకు వచ్చినంత గా సంబర పడిపోయారు. రవీంద్రుని శతజయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని స్థాపించారు.
Fruit Gathering  అనే  రవీంద్రుడి కవితని అక్కడ హైస్కూల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారు. రవీంద్రుడు కమ్మ్యూనిస్తు కాదు. ఆయన గీతాంజలి నీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ వ్యవస్తాపకులలో ఒకరు చైనా భాష లోకి అనువదించారు.
రవీంద్రుడు రచనలన్నీ చైనా భాషల్లోకి అనువాద మయ్యాయి. మేం అక్కడ వుండగానే ఒక చైనా రచయిత రవీంద్రుడు రచనను పొరపాటున తప్పుగా అనువదించాడు అని అతన్ని ఉతికి ఆరేసినారు. అతన్ని విమర్శిస్తూ చైనా అధికార పత్రిక బీజింగ్ రివ్యూ లో సంపా దకీయమీ రాశారు.
ఎప్పుడో జరిగిన యుద్ధంలో మనం ఓడిపోయామన్న అక్కసుతో చైనా పట్ల ద్వేష భావం పెంచు కోవడం మంచిది కాదు. మనకు చైనాకు క్రీస్తు పూర్వం నుంచి వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. మరి ఏ దేసంతో నూ ఇంత పురాతన సంభందాలు లేవు.
మనకంటే రెండేళ్లు ఆలస్యంగా స్వాతంత్య్రం పొందిన చైనా ప్రపంచలో రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మనకంటే ఎక్కువ జనాభా ఉన్నా దేశం. 136 కోట్ల మందిలో 130 కోట్ల మందిని దారిద్య్ర రేఖను దాటించారు. అంటే కూడు, గుడ్డ, గూడు సమస్యను తీర్చారు.
చైనా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడింది. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి కాని, అక్కసు వెళ్ల గాక్కకూడడు. కస్తాల్లో ఉన్న దేశం పైన సందు దొరికింది కదా అని రాళ్ళు వెయ్యి కూడదు. అలా చేయడం విజ్ఞత కాదు.- రాఘవ శర్మ.