ఎపి-తెలంగాణ ఆర్టిసి బస్సులు తిరిగేదెప్పుడు?

ఆంధ్రప్రదేశ్ నుంచి   అంత ర్రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించడం మీద  ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. ఈ బస్సు సర్వీసులు ప్రారంభిస్తాని వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. రైల్లు విమానాలు నడుస్తున్నాయి. అంతర్రాష్ట్ర ప్రయాణాలను అనుమతించేందుకు అభ్యంతరం లేదని కేంద్రం కూడా ప్రకటించింది. కాకపోతు, తుది నిర్ణయం ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. అయితే, ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రాలు జంకుతున్నాయి. రైళ్లు నడుస్తున్నపుడు అదే మాదిరిగా కోవిడ్ ప్రొటొకోల్ నియమాల ప్రకారమే బస్సు సర్వీసులను నడపవచ్చుగదాఅని ప్రయాణికులుప్రశ్నిస్తున్నారు.
ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సుల రాకపోకలపై ఎపుడు మొదలవుతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం సరిహద్దు రాష్ట్రాల మధ్య  సమన్వయం లేదనే దీనితో ప్రజలు నష్టపోతున్నారు.
బస్ లు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఏపీ సీఎస్‌ వారం కిందటే  లేఖ రాశారు. అయితే, దీనిపై ఈ రాష్ట్రాల నుంచి ఇంకా స్పందన అందలేదని అందువల్ల అంతర్రాష్ట్ర బసు సర్వీసులు ఎపుడు మొదలవుతాయో చెప్పలేమని  ఎపి ఎస్  ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.