కొత్త సర్పంచ్ లకు ఆ ఆహ్వానం లేదు

కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేశారు. మూడో విడుత పంచాయతీ ఎన్నికల తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం ఉంటుందని, ఆ తర్వాతనే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు పాల్గొనాలని సూచించింది.

గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి మాత్రమే జాతీయ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మూడు విడతల ఫలితాల తర్వాత ఒకే రోజున రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ తర్వాతనే వారు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈసీ తెలిపింది. పాఠశాలల్లో కూడా కొత్త సర్పంచ్ లతో జెండావిష్కరణ చేయించవద్దని విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *