పూరి జగన్నాధ ఆలయానికి కొత్త సమస్య, అధికారుల్లో ఆందోళన

ఒదిషా పూరి జగన్నాథ స్వామి ఆలయానికి కస్తూరి (musk) కొరత వస్తూన్నది. దీని గురించి ఆలయ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇపుడున్న కస్తూరి నిల్వలు రెండుమూడు సంవత్సరాలలో తరిగిపోతాయి.
దీనిని దృష్టిలోపెట్టుకుని జగన్నాధడు, బలదేవుడు, సుభద్ర విగ్రహాలకు కస్తూరి ని పూయడం బాగా తగ్గించారు.
కేవలం రథ యాత్ర సమయంలోనే కస్తూరిని వాడాల్సి వస్తున్నది ఆలయ అధికారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో జగన్నాథ యాత్రకు ముందు అయిదు గ్రాముల కస్తూరిని, ఇతర మూలికలతో కలిపి లేపనం తయారు చేసి విగ్రహాలకు పట్టించడం ఆనవాయితీ.
పూరి ఆలయానికి సాంప్రదాయకంగా కస్తూరి నేపాల్ నుంచి సరఫరా అయ్యేది. ఈ మధ్య నేపాల్ నుంచి సరఫరా ఆగిపోయింది. నిల్వలు అయిపోతున్నాయని, దేవుడి విగ్రహానికి లేపనానికి కస్తూరి కొరత వస్తుందని ,సరఫరా పునరుద్దరించాలని ఆలయ నిర్వాహకులు నేపాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కాని నేపాల్ ఇపుడు కస్తూరి సరఫరా చేసేందుకు సుముఖంగా లేదు. కస్తూరిని హిమాలయ ప్రాంతాల్లో సంచరించే కస్తూరి మృగం నుంచి సేకరిస్తారు. ఇపుడున్న నేపాల్ చట్టాల ప్రకారం కస్తూరి మృగాలను చంపకూడదు. కస్తూరి మృగాన్ని అంతరించి పోతున్నజంతువుల జాబితాలో చేర్చారు.
అందుకే తాజాగా కస్తూరిని నేపాల్ ప్రభుత్వం సరఫరా చేయలేక పోతున్నది.
కస్తూరిని కస్తూరి జింక (musk deer) తోక దగ్గిర ఉన్న ఒక గ్రంధి (musk pod) నుంచి సేకరిస్తారు. ప్రతి గ్రంధి నుంచి 15 గ్రాముల దాకా సువాసన వెదజల్లే కస్తూరి లభిస్తుంది. దీనికి ఈ జంతువును వేటాడాల్సి వస్తుంది.
1979 ఇంటర్నేషనల్ ట్రడ్ ఇన్ ఎండెంజర్డ్ స్పీసిస్ అప్ వైల్ డ్ ఫానా అండ్ ఫ్లోరా (CITES) ఒప్పందం ప్రకారం ఇపుడు కస్తూరి మృగం అంతరించిపోతున్న జంతువును.దీనిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో నేపాల్ రాజకుటుంబానికి పూరీ జగన్నాథ స్వామి ఆలయానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ గుడికి సంబంధించి నేపాల్ రాజకుటుంబానికి కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి. దీని వల్ల రాజకుటుంబం ఉదారంగా కస్తూరిని సరఫరా చేస్తూ వచ్చింది.
అయితే, 2001లో నేపాల్ రాజకుటుంబం ఉచకోతలో నేపాల్ రాజు బీరేంద్ర కూడాచనిపోయాడు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సంప్రదాయాన్ని పెద్దగా పాటించడం లేదు.
నేపాల్ నుంచి సరఫరా ఆగిపోవడంతో తమ దగ్గిర ఉన్న కస్తూరిని ఆలయానికి కానుకగా ఇవ్వాలని ఆలయ అధికారులు భక్తులను కోరుతున్నారు.
నేపాల్ సరఫరా చేస్తే కొనేందుకు కూడా ఆలయం సిద్ధంగా ఉంది. దీనికికూడా నేపాల్ సిద్దంగా లేదు.
నేపాల్ రాజు బీరేంద్ర 1999లో ఆలయాన్ని సందర్శించి పెద్ద ఎత్తున కస్తూరి అందించారు.అంతకు ముందు 1993లో కూడా ఆయన ఆలయం సందర్శించారు. 2007లో ఒక నాగా సాధువు కూడా కొంత కస్తూరి అందించారు.
అయితే, ఇపుడీ నిల్వలు తరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని చాలాసార్లు ఆలయ అధికారులు నేపాల్ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూనే ఉన్నారు. 2017లో నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారి ఆలయాన్ని సందర్శించినపుడు సమస్యను ఆమె స్వయంగా వినిపించారు.
తిరుమల వంటి ఇతర ఆలయాలలో కూడాకస్తూరి వినియోగిస్తారు. నిజానికి తిరుపతి కూడా ఇపుడే ఇదే చట్టం పునుగు తైలం కొరత ఎదుర్కొంటూ వుంది.
అయితే, ఇతర ఆలయాలకు , పూరీ ఆలయానికి చాలా తేడా ఉంది.
పూరీఆలయంలో విగ్రహాలు రాతితో కాక వేప చెక్కతో చేసినవి. అందువల్ల ఈ విగ్రహాలను పురుగుల బారి నుంచి కాపాడుకునేందుకు కస్తూరి లేపనం పూయాల్సి వుంటుంది. ఇది చాలా అవసరం. కస్తూరిని గంధం, మరిన్ని ఇతర మూలికల మిశ్రమంతో కలిపి విగ్రహాలకు లేపనంగా పట్టిస్తారు.
పూరీ విగ్రహాలు కొయ్యతో చేసినవి కాబట్టి ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకొకసారి  కొత్త విగ్రహాలు ప్రతిష్టిస్తారు. ఈ కార్యక్రమాని నబకలేబర అని పిల్తుస్తుంటారు. ఈ కొయ్య సేకరించడం చాలా పెద్ద తతంగం.  ఒక సారి ప్రతిష్టించిన విగ్రహాలు క్రిిమికీటకాల బారిన పడకుండా ఉండేందుకు కస్తూరి గంధం లేపనం దట్టంగా పట్టించాల్సి ఉంటుంది.
అపుడు విగ్రహం మీద ఒక కాంతి వంతమయిన పొరవస్తుంది. ఇది విగ్రహాన్ని క్రిమికీటకాలనుంచి కాపాడుతుంది. ఇపుడు కస్తూరి బాగా తగ్గించి వాడుతున్నారు. దీని వల్ల దేవుడి గర్భగుడిలోకి బొదింకలు, ఎలుకలు ప్రవేశిస్తున్నాయని ఆలయ పెద్ద పూజారి రామకృష్ణ దాస్ మహాపాత్ర చెబుతున్నారు.
ఈ ప్రమాదాన్ని గుర్తించాక ఒరి స్సా ప్రభుత్వం కేంద్ర సహాయం కూడా కోరింది. కస్తూరి మృగాన్ని అంతరించిపోతున్న జంతువులకు సంబంధించిన చట్టంలో షెడ్యూల్ 1 లో చేర్చారు. ఈ క్యాటగిరిలో ఉన్నపుడు జంతువులను చాలా జాగ్రత్తగా కాపాడాల్సి వస్తుంది. ఈ జాబితాలో ఉన్న జంతువులను చంపితే మూడు నుంచి అయిదేళ్ల దాకా జైలు శిక్షపడుతుంది.
ఈ జంతువు కస్తూరి మగజంతువులను ఆకట్టుకునేందుకు వినియోగిస్తుంది. తన తోకను చెట్టకు రాసి, కస్తూరి వాసన తగిలేలా చేసి,తను ఈప్రాంతంలో ఉన్నట్లు కస్తూరి ఆడజంతువు మగ జంతువుకు సంకేతాలు పంపిస్తుంది.