భారత్ పార్లమెంటు ఆన్ లైన్ సమావేశాలు? పరిశీలనలో ప్రతిపాదన

ఈ సారి పార్లమెంటు సమావేశాలు ఆన్ లైన్ లో జరుగుతాయా? ఈ విషయాన్ని పార్లమెంటు పరిశీలిస్తూ ఉంది. దాదాపు 90 యేళ్ల చరిత్ర ఉన్న పార్లమెంటుకు ఇంతవరకు ఎపుడూ ఎదురుగాని సమస్యకరోనా సమస్య ఎదురవుతూ ఉంది.  అందువల్ల కరోనా నియమాల ప్రకారం పార్లమెంటును నిర్వహించాల్సి ఉంటుంది. పార్లమెంటు సభలలో సభ్యుల మధ్య సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూడాలి. సభలలో చూస్తే చాలదు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలలో, సభ్యులంతా సేద తీరే సెంట్రల్ హాల్ లో కూడా సోషల్ డిస్టెన్స్ ఉండేలాచూడాలి.ఇది సాధ్యమా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.
పార్లమెంటు అంటే నే ప్రసంగాలు,సభలో ధర్నాలు, స్పీకర్ పోడియం ను చుట్టుముట్టడాలు,  బైఠాయింపులు. ప్రసంగించేటపుడు  మాస్కు ధరించడం కష్టం. ప్రసంగిస్తున్నపు మాస్క్ తీసేశాయాలి. ఆవేశంగా ప్రసంగిస్తున్నపుడు ఎంగిలి తుంపర్లు పడతాయి. అలాగే స్పీకర్ పోడియాన్ని చుట్టుముటినపుడు సోషల్ డిస్టెన్స్ పాటించడం సాధ్యమా. ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలపకుండా  పార్లమెంటును సజావుగా సాగించవు. ఇప్పటికే కరోనా అదుపుచేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమయిందని ప్రతిపక్షం గొడవచేస్తున్నది. వలసకూలీల సమస్య దేశాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య. ఇలాగే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని చాలా రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు వాడిగా వేడిగా జరగకుండా ప్రతిపక్షాలు వదలిపెట్టవు. ఇలాంటి సమావేశాలు ప్రమాదకం అందువల్ల. పార్లమెంటు సమావేశాలు రద్దు చేసి వర్చువల్ (ఆన్ లైన్ ) సమావేేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయం పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఎందుకంటే, గొడవ చేసేందుకు ప్రతిపక్షానికి అవకాశమీయకుండా పాలక పక్షం ఎపుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆన్ లైన్ సమావేశం దీనికొక చక్కటి మార్గం. అయితే, ప్రతిపక్షం దీనికి అంగీకరిస్తుందా?
వర్చువల్ పార్లమెంటు సమావేశంలో జరిగితే, అది విజయవంతమయితే, భవిష్యత్తులో పార్లమెంటు రాజకీయాల   స్వరూపం పూర్తిగా మారిపోతుంది.

తెలుగు సినిమాల్లో మోటివేషనల్ పాటలు, జీవిత పాఠాలు

కరోనా కష్టాల మధ్య పార్లమెంటు సమావేశం ఇలా జరుగుతుంది
పార్లమెంటు వర్షా కాల సమావేశాలకు సిద్ధమవుతూఉంది. అయితే, పార్లమెంటు సమావేశాలుకూడా కరోనా ప్రొటోకోల్ ప్రకారం జరగాలి. పార్లమెంటు సభ్యులు కూడా సోషల్ డిస్టెన్సు పాటిస్తూనే లోక్ సభ రాజ్యసభ సమావేశాలలో పాల్గొన్నాలి.
అందువల్ల పార్లమెంటు సమావేశాలను ఈ సారి ఎలా నిర్వహించాలనే దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. రాజ్యసభ ఛెయిర్మన్ వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఈ విషయాన్ని చర్చించారు. సాధారణంగా పార్లమెంటులో లోక్ సభ సభ్యులను రాజ్యసభలోకి, రాజ్యసభ సభ్యులు లోక్ సభలోకి రాకూడదు. అయితే, ఇపుడు ఈ పరిస్థితి తారుమారవుతున్నది. సభ్యుల మధ్య సోషలి డిస్టాన్స్ పాటించాలి కాబట్టి ఇపుడు సభలు చాలవు . అందువల్ల తక్కువ మంది సభ్యులను న్న రాజ్యసభను లోక్ సభలోకి మార్చి, లోక్ సభను పార్లమెంటు సెంట్రల్ హాల్ లోకి తీసుకువచ్చి సమావేశాలు నిర్వహిస్తే ఎలా బాగుంటుందనే విషయాన్ని చర్చిస్తున్నారు.
ఇప్పట్లో కరోనా పాండెమిక్ బెడద తొలగే అవకాశం లేదు. అందువల్ల వర్షాకాల పార్లమెంటు సమావేశాలను కరోనా నీడల్లోనే నడపాలి.అంటే పార్లమెంటు సభ్యులు మూతికి మాస్క్ తగిలించుకుని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సభలలో కూర్చోవాలి. సభా వేదికలను మార్చడమే కాదు, టెక్నాలజీ ఉపయోగించి వర్చువల్ సమావేశాలను నిర్వహించే విషయం కూడా పరిశీలించాలని సభాపతులిద్దరు ఆయన సభల సెక్రెటరీల సలహాలు కోరారు.
లోక్ సభ సెంట్రల్ హాలులో 800 మంది కూర్చోవచ్చు. అంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లోక్ సభ లో ఉన్న543 మంది సభ్యులను దూరం దూరంగా కూర్చోబెట్టవచ్చని అనుకుంటున్నారు. ఇదే విధంగా రాజ్యసభ లో 245 మంది ఉన్నారు. వీరంతా రెండు మీటర్ల సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లోక్ సభలో కూర్చునేందుకు వీలవుతుందా లేదా అనే విషయాన్ని సెక్రెటరీ జనరల్స్ పరీశీలించాల్సి వుంది.
సెంట్రల్ హాల్ లో పార్లమెంటు సమావేశాలు జరగవు. భారత స్వాంతంత్ర్య స్వర్ణోత్సవ ప్రత్యేక సమావేశం సెంట్రల్ హాల్ లోజరిగింది. తర్వాత ప్రతి ఏడాది బడ్జెట్ సమావేశాల ముందు రాష్ట్ర ప్రతి ప్రసంగం కోసం ఉభయ సభ సంయుక్త సమావేశం పార్లమెంటు సెంట్రల్ హాలులో జరుగుతుంది. అయితే, ఇక్కడ ఎపుడు రెగ్యులర్ పార్లమెంటు సమావేశాలు జరగలేదు. అంటే పార్లమెంటు చర్చలు జరగ లేదు.
పార్లమెంటు వర్షా కాల సమావేశాలు జూలై లో ప్రారంభమయిన ఆగస్టు దాకా నడుస్తుంటాయి. అయితే,వీటికి కచ్చింగా వర్షకాలంలోనే నడపాలనే నిమమేమీ లేదు. అవసరమనుకుంటే మరోనెలకి వాయిదా వేసుకోవచ్చు. అయితే, వాయిదా వేసుకున్న కరోనా ప్రొటొకోల్ పాటించాల్సి ఉంటుంది కాబట్టి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సభలను మార్పు చేసి నిర్వహిస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కోవిడ్ పాండెమిక్ మధ్యలో అర్ధాంతరంగా మార్చి 23 న ముగిశాయి.
పార్లమెంటు సెంట్రల్ హాల్

పార్లమెంటు సెంట్రల్ హాల్ అనేది పార్లమెంటులో ఒక విశిష్టమయిన ప్రదేశం. ఇందులోకి రాజ్యసభ, లోక్ సభ ఎంపిలు, మాజీ ఎంపిలు సీనియర్ జర్నలిస్టులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. పార్లమెంటు సముదాయంలో ఉన్న పెద్ద హల్ ఇదే. అందుకే అందరు ఇక్కడ కూర్చుని మాట్లాడుతకోవడం, చర్చించుకోవడం చేస్తుంటారు. ఎంపిలు, ప్రధానిని కలుసుకునేందుకు ఇదొక చక్కని అవకాశం. సాధారణంగా ప్రధాని కలిసేందుకు అనుమతి అవసరం. ఇక్కడ ఎలాంటి అనుమతి లేదు. ఏదోఒక సభలోనుంచి ప్రధాని వెళ్లిపోతున్నపుడు చటుక్కున పోయి నమస్కారం పెట్టి, వినతి ప్రతం ఇవ్వవచ్చు. అపుడపుడు ప్రధాని కూడ ఇక్కడ కూర్చుంటుంటారు. ఇక్కడ ప్రవేశం వున్న వారందిరికి క్యాంటిన్ సదుపాయం ఉంది.

Like this story? Share it with a friend

స్వతంత్ర భారత పార్లమెంటు ఎర్పడక ముందు ఇది రాజ్యంగసభ (Constituent Assembly). ఇక్కడే రాజ్యాంగ తయారయింది. బ్రిటిష్ పాలకుల నుంచి భారతీయుల చేతికి అధికార బదిలీ వేదిక కూడా పార్లమెంటు సెంట్రల్ హాలే.
స్వాతంత్య్ర ప్రకటన వచ్చిన ఆర్థరాత్రి అంటే ఆగస్ట్ 14, 1947 ఆర్ధరాత్రి, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రఖ్యాత “Tryst With Destiny” ప్రసంగం చేసిన విషయం గుర్తుంది కదా. ఆయన ప్రసంగించింది పార్లమెంటు సెంట్రల్ హాల్ నుంచే.
ఈ మధ్య కాలంలో జిఎస్ టి మీద పార్లమెంటు సమావేశం జరిగింది సెంట్రల్ హాల్ లోనే. తర్వాత 1992లో క్విట్ ఇండియా ఉద్యమం 50 వ వార్షికోత్సవం కోసం పార్లమెంటు ఆగస్టు ఆర్ధరాత్రి సమావేశమయిందిక్కడే. గాంధీ క్విట్ ఇండియా పిలుపు ఆగస్టు 8, 1942 బొంబాయిలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇచ్చారు.
1997 ఆగస్టు 14-15 అర్ధరాత్రి స్వాతంత్ర్యం 50 వార్షికోత్సవం కోసం పార్లమెంటులో సంయుక్త సమావేశం సెంట్రల్ హాల్ లోనే జరిగింది.
సెంట్రల్ హాల్ గోడల మీద 25 భారత మహానేత చిత్రాలున్నాయి. ఈ జాబితాలకెక్కిన చివరి చిత్రం ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి. ఆయన చిత్రపటాన్ని రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ 2019 ఫిబ్రవరి 12 ఆవిష్కరించారు.

పార్లమెంటు నిర్మాణానికి ఫిబ్రవరి 12, 1921న డ్యూక్ ఆఫ్ కన్నాట్ శంకుస్థాపన చేశారు. భవనం