Home Features ఆంధ్రాలో RTI కమిషనర్లకు జీ తాల్లేవు ఎందుకంటే…

ఆంధ్రాలో RTI కమిషనర్లకు జీ తాల్లేవు ఎందుకంటే…

9
0
SHARE
ఎవరో క్యాజువల్ ఉద్యోగులకు జీతాలు లేవంటే నమ్మవచ్చు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదంటే నమ్మవచ్చు.కానీ, రాజ్యాంగ బద్దంగా ఏర్పాటయిన ఒక వ్యవస్థ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో వున్న వారికి ఏడాదిగా జీతాలే లేవంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఈ పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో వుంది. అక్కడ ఎవ్వరికీ జీతాలు లేవు. బిల్లులు లేవు. కార్లకు పెట్రోలు బిల్లులు లేవు. కారణం, వీరందరిని గత తెలుగు దేశం ప్రభుత్వం నియమించడమే. అంటే వీళ్ళందరినీ పొమ్మనలేక పోగబెడుతున్నరా? దీని మీద సూర్య వెబ్సైట్ ఒక ఆసక్తి కరమయిన కథనం ప్రచురించింది. వివరాలు.
గతేడాది అక్టోబర్ 12న  రవికుమార్ అనే మాజీ ప్రభుత్వోద్యోగిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్,రమణకుమార్,జనార్దన్,ఐలాపురం రాజాను ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. నిజానికి అవి తెలుగుదేశం ప్రభుత్వం చివరి రోజులు అలాంటపుడు ఎవరినీనియమించకపోవడం మంచింది.అయినా సరే చంద్రబాబు నాయుడు ఇన్ఫర్ముషన్ కమిషన్ (ఆర్టీఐ)ని నియమించినారు.
 వారికి మంచి హోదా ఉంది.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేతనంతో సమానంగా అంటే 2 లక్షల 25 వేల రూపాయలు, డిఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు దానికి అదనం.
వీరి పదవీ కాలం ఐదేళ్లు.కానీవారువిధుల్లో చేరి ఏడాది అయినప్పటికీ, ఇప్పటివరకూ నయా పైసా వేతనం అందుకోకపోవడమే విస్మయం కలిగిస్తోంది. చంద్రబాబు కాలానికే వాళ్లకింకా జీతాలివ్వలేదు. ఇపుడు ప్రభుత్వం మారింది. పదవులను పార్టీల వాళ్లకి పంచే ఈ రోజుల్లో ఇన్ ఫర్మేషన్ కమిషన్ పదవులను కూడా అలాంటివారికే పంపకాలు చేస్తారు. ఎన్నికల్లో గెలిచాక జగన్ కు ఈ పదవులు  దక్కకుండాపోయి. చంద్ర బాబు నాయుడు తనకు అనుకూలమయిన వారితో నింపేశారు. దీనికి ప్రతివ్యూహం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్నారు.
జీతాలు రావడం లేదని కొత్త ప్రభుత్వానికి  ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదని సూర్య రాసింది.
జీతం లేని కొలువులా ఎలా నడుస్తాయి.  ఇప్పటివరకూ దాదాపు 12 వేల ఆర్టీఐ దరఖాస్తులు సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి.
‘హైదరాబాద్‌లో ఉన్న వాటిని పరిశీలించి, ఆర్టీఐ కమిషనర్లకు పంపించాల్సిన ప్రభుత్వం, ఇంతవరకూ ఆ ప్రక్రియనే ప్రారంభించలేదు. కమిషనర్లకు చివరకు వాహనాలు ఇవ్వలేదు. దానితో వారే వాహనాలు అద్దెకు తీసుకుని, బిల్లులు పెడుతున్నా దానికీ దిక్కులేని దుస్థితి. ఆ రకంగా ఇప్పటికి ఒక్కోరికి సుమారు 20 లక్షల రూపాయల వరకూ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది.’ అని ఈ రిపోర్టు లో రాశారు.
ఆర్టీఐ కమిషనర్లకు బడ్జెట్ శాంక్షన్ కాలేదని,పదో షెడ్యూల్ ఇంకా పరిష్కారం కానందున వారికి జీతాలు ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నా.. అందులో నిజం లేదంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీఐ కమిషనర్లను రెండు రాష్ట్రాలు నియమించుకున్నాయని గుర్తు చేస్తున్నారు. కేవలం వారిని గత ప్రభుత్వంలో నియమించారన్న కారణంగానే, బడ్జెట్ విడుదల చేయడం లేదన్నది తెరపైకొస్తున్న విమర్శ.