చెట్లు కూలిన బాధ: సిఎంను కదలించిన మణిపూర్ అమ్మాయి కంటతడి

తను సర్వస్వంగా భావించిన రెండు గుల్ మోహర్ (సుంకేశుల Royal Poinciana) చెట్లు కళ్లెదుటో ఒక  రోడ్డుకు బలికావడం  మణిపూర్ కు చెందిన తొమిదేళ్ల ఎలంగ్ బామ్ వాలెంటినా దేవి హృదయాన్ని కలచివేసింది.
పాప దుఃఖం అపుకో లేక పోయింది.  వెక్కి వెక్కి ఎడ్చింది.

మణిపూర్ లోని  కాంచింగ్  పట్టణంలోని అముటాంబి డివైన్ లైఫ్ పబ్లిక్ స్కూల్ లో  వాలెంటినా దేవి అయిదో తరగతి చదువుతూ ఉంది.
ఈ వూరు రాజధాని ఇంపాల్ కు 45 కి.మీ దూరాన ఉంటుంది.
  వాలెంటినీ దేవీ ఒకటో తరగతిలో ఉన్నపుడు వాళ్లవూర్లో ఏటి ఒడ్డున రెండు గుల్ మొహర్ మొక్కలు నాటింది. ఈ  నాలుగేండ్లు వాటిని జాగ్రత్త కాపాడుతూ వచ్చింది.వాలెంటినా అయిదోతరగతికి వచ్చే నాటికి అవి బాగా ఎపుగా పెరిగి చెట్లయినాయి.పుష్పిస్తున్నాయి.
ఇది కూడా చదవండి:వార్తల కెక్కని వాస్తవం, చెట్లు కుటుంబాలను కూల్చేశాయి
గత శనివారంనాడు వాలెంటినాకు వూహించని ఉపద్రవం ఎదురయింది.
ఏటిపక్కన ఒక రోడ్డు వేసే వెడల్పు చేసే కార్యక్రమం మొదలయింది. అదొక ఉపద్రవం మయింది వాలెంటినా పాలిట.  రోడ్ద వెడల్పు చేసేందుకు చెట్లు నరకడం మొదలుపెట్టారు.
వాలెంటినా చూస్తుండగానే అధికారులు అక్కడున్న చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేశారు. ఇందులో వాలెంటినా మురిపెంగా పెంచి పెద్ద చేసిన గుల్ మెహర్ లు కూడా ఉన్నాయి.
అంతే, చిన్నారి వాలెంటినా కాళ్ల కింద భూమి కదిలిపోయింది. తను, తన రెండు చెట్లు తప్పమరొకటి కనిపించని చి…న్న ప్రపంచం, అందాల ప్రపంచం కూలిపోయింది.
ఏడుపు ఆపుకోలేకపోయింది. వెక్కి వెక్కి ఎడ్చింది. అక్కడున్నవాళ్లలో ఎవరో ఆపుకోలేని వాలెంటీనాా దుఃఖాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రపంచమంతా పరుగులెత్తిన ఈ వీడియో చిట్టచివరకు ముఖ్యమంత్రి నంగోతమ్ బామ్ బీరెన్ కంట పడింది. ఆయన చలించి పోయారు. ‘ తన చెట్టు కూలిపోవడంతో ఈ చిన్న పాప తన ఆత్మీయులెవరో చనిపోయినంతగా దుంఖించింది. ఈ వీడియో నేను చూశాను. ఈ రెండు చెట్ల కోసం, పెద్ద వాళ్లెవరూ అంతగా పట్టించుకోని చెట్లకోసం,  ఆ పాప పడిన ఆవేదన నన్ను కదలిచింది. నేను వెంటనే  జిల్లా ఎస్  పి యాంగ్ కామ్ విక్టోరియాకు  ఫోన్ చేసి వెంటనే పాపను కలసి వారించమని చెప్పాను. తన ఇష్టమెచ్చిన చోట భద్రంగా నాటుకునేందుకు 20 మొక్కలందించాలని కోరాను,’అని ముఖ్యమంత్రి ది హిందూకు చెప్పారు..

తర్వాత మొన్ననే జూన్ లో ప్రభుత్వం ప్రారంభించిన గ్రీన్ మణిపూర్ మిషన్ కు ఆ పాప కంటే యోగ్యలైన ప్రతినిధి ఎవరుంటారని నాకనిపించింది. ఆ చిన్న వయసులో చెట్ల పట్ల ఆ ఆమ్మాయికి ఆపేక్ష ఎవరినైనా కదిలించేలా ఉంది. అందుకే ఆమెయే గ్రీన్ మణిపూర్ మిషన్ కు నిజమయిన అంబాసిడర్ అని భావించి వెంటనే ఉత్తర్వులిచ్చాను. ఈ అర్డర్ ను ఆ అమ్మాయికి స్వయంగా అందివ్వాలని అధికారులను కోరాను, అని  ముఖ్యమంత్రి చెప్పారు.
ఈ అర్డర్ ప్రకారం, వాలెంటినా దేవి  మణిపూర్ లో అడవుల విస్తీర్ణంపెంచేందుకు చేపట్టే ప్రతికార్యక్రమంలో, ప్రతి అడ్వర్టయిజ్ మెంట్ లో ఆమె బొమ్మ ఉంటుంది. ఆమెకు ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తుంది. ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తే ఆమెను ఏ ప్రభుత్వ శాఖ  స్పాన్సర్ చేస్తే ఆ శాఖ భోజనం వసతి కూడా  ప్రభుత్వ రేట్ల ప్రకారం కల్పిస్తుంది.

https://trendingtelugunews.com/gold-silver-prices-explode-to-scale-up-record-high/