బిజెపి పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్న నోబెల్ శాస్త్రవేత్త వెంకీ

భారతీయ సంతతికి చెందిన నోబెల్ శాస్త్రవేత్త వెంటట్రామన్ రామక్రిష్ణన్ భారత ప్రభుత్వం తీసుకువస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించారు.
మత ప్రాతికగా ఒక దేశ పౌరసత్వం నిర్ణయం కావడానికి తాను వ్యతిరేకినని ఆయన టెలిగ్రాఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యలూ స్పష్టంగా చెప్పారు. ఈ బిల్లుతో భారత దేశం తప్పు మలుపుతిరుగుతూఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

వెంకట్రామన్ రామక్రిష్ణన్ ని వెంకీ అని పిలుస్తుంటారు.
‘నేను విదేశాలలో జీవిస్తున్నా ఈ విషయం మీద బహిరంగంగా వ్యాఖ్యానించడానికి కారణం, నాకు భారతదేశమంటే చాలా ఇష్టం. భారతదేశం ఒక మత సహనతత్వంతో ఉందని నేనేపుడూ విశ్వసిస్తూంటాను. భారత దేశం విజయవంతం కావాలనేది నా ఆకాంక్ష,’ అని ఆయనఅన్నారు. ప్రొఫెసర్ వెంకీకి 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. 2010లో ఆయనను  భారత ప్రభుత్వం పద్మవిభూషన్ తో సత్కరించింది.
వెంకీ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం మోలెక్యులార్ లాబోరేటరీలో పనిచేస్తూంటారు. అలాగే లండన్ లోని రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన అమెరికా- ఇంగ్లండుల ఉమ్మడి పౌరుడు.
‘భారతదేశం ఎంతో ఆలోచనచేశాకే సెక్యులర్ రాజ్యాంగం రూపొందించుకుంది. భారతరాజ్యాంగా ఏ ఒక్క మతం వైపు మొగ్గు చూపదు. అదే భారత రాజ్యంగంపునాది.అందుకే భారతదేశంలో 200 మిలియన్లు ముస్లింలుంటున్నారు. అదే పాకిస్తాన్ లో ముస్లిమేతరులెక్కడ? అక్కడ ముస్లిమేతరులు ఒక్క శాతమే,’ అనిఆయన పేర్కొన్నారు.
‘మనం పాకిస్తాన్ కాదు. మనం సెక్యులర్ కావడంలోనే తేడా యావత్తు ఉంది. నిజానికి నేను ‘మనం’ అనకూడదు. ఇండియా అనాలి. ఇండియా అంటే ఎవరిమీద వివక్ష ఉండదు అని అర్థం. భారత రాజ్యాంగానికున్న మరొక విశిష్టత ఏంటంటే ఇది శాస్త్రీయ దృక్పథం (Scientific temperament) ఆమోదించింది. సైంటిఫిక్ టెంపర్ మెంటు అంటే … మీరు సాక్ష్యాధారాలను బట్టి ప్రతిదాన్ని విశ్వసించాలనుకుంటారు. అంటే, మత విశ్వాసాల పరంగా దేని మీద వివక్ష చూపరు అని, ’ అని వెంకీ అన్నారు.
‘నేను న్యాయ నిపుణుని కాదుగాని, ఒక్క మాట చెబుతాను. సజావయిన కోర్టేదయినా ఈ బిల్లును కొట్టివేస్తుంది,’ అని ఆయన అన్నారు.
‘సైన్స్ ను విశ్వాసాలతో ముడేసుకున్న దేశాలు తమ దేశాల్లోని సైన్స్ ను సర్వనాశనం చేసుకున్నాయి. నాజీ జర్మనీ లో దీనిని చూడవచ్చు. విషయమేంటంటే, హిట్లర్ దెబ్బనుంచి కోలుకునేందుకు జర్మన్ సైన్స్ కు 50  సంవత్సరాలు పట్టింది,’ అని ఆయన అన్నారు.
‘నేను భారత్ కి ఎంతో రుణ పడి ఉన్నాను. ఎందుకంటే నాకు ఇక్కడి నుంచే స్కాలర్ షిప్ వచ్చింది. నేనిక్కడే చదువుకున్నాను. నాకు ఇండియా అంటే వల్ల మాలిన ప్రేమ. ఇంండియా ముందుకు సాగాలనే ఎపుడు కోరుకుంటాను. ఈ దేశం ఇలాంటి (పౌరసత్వం బిల్లు ) వంటి అనసర విషయాల్లో కూరుకుపోతున్నదేమో నని పిస్తూ ఉంది. కొంతమంది కరుడు గట్టి ఛాందసులు తమ విశ్వాసాలను, ఇతరులందరి మీద అంటేమొత్తం దేశం మీద రుద్దాలనుకుంటున్నారు,’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ బిల్లుకు మద్దతు కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలు తెస్తున్న పిటిషన్ మీద తాను సంతకం చేయనని ఆయన చెప్పారు.