ఊర్లలో గ్రంధాలయాలేమయిపోయాయి?

(కురాడి చంద్రశేఖర కల్కూర)
ఆస్తి పన్నుతొ పాటు, గ్రంథాలయ సెస్సు రూపములొ ప్రజలు ఇచ్చిన సొమ్ము ప్రతి జిల్లా గ్రాంథాలయ సంస్ఠలలొ కొట్ళాది రూపాయిలు జమ ఉన్నవి. ఇవి గాక ప్రతి స్థానిక సంస్థ కోట్ళాది రుపాయిలు బకాయిలూ ఉన్నాయి. ప్రభుత్వం దీనికొరకు ప్రత్యేకమైన బడ్గెట్ కేటాయించవలసిన అవసరం లేదు. ఊన్న మొత్తాన్ని వ్యయించె హక్కు ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఉన్నది. ప్రభుత్వ అనుమతి అవసరం లేదు.
ప్రస్తుతం ప్రభుత్వం పరిషత్ ను రద్దు చేసి, దాని స్థానములొ ’పర్సన్ ఇన్ చార్జ్’ గా, పాఠశాలా విద్యా కమిషనర్ గారిని నియమించింది.
పుస్తకాలు ఎన్నుకొవడానికి, నిపుణలతొ ’సైటేశన్ కమిటి’ వెయ్యవలసి ఉన్నది. అవి ప్రైవెట్ వ్యక్తులనుండి, వ్యాపారస్తులనుండి, పబ్లిశర్సునుండి కొన్నడానికి సిఫారసు చెస్తుంది. అంతవరకు ప్రభుత్వ ప్రకటణలు, సాహిత్య ఆకాడెమి, న్యాశనల్ బుక్ ట్రస్టునుండి, కొన్నడానికి ఏ సిఫారస్సులూ అవసరం లేదు. కేంద్ర సాహిత్య అకాడెమి దక్షిణ భారత ప్రాంతీయ కార్యాలయం బెంగళూరులొ ఉన్నది. కన్నడ, తమిళం, మలయాళమ్ భాషల పుస్తకాల నకలులు దొరకడం లేదు.
పారేసిన పాత పుస్తకాలతో కొత్త లైబ్రరీ, ఈ శానిటేషన్ వర్కర్లు పుస్తక ప్రేమకు శాల్యూట్
ఐతె తెలుగు పుస్తకాలు మాత్రం కట్టలు కట్టలు, చెదులు పట్టి పోతున్నాయి. విపరీతమేమంటే, తిరుమల రామచంద్రగారి ఆత్కకథ, ’హంపినుండి హరప్పాదాక’ మరియు గడియారం రామకృష్ణ శర్మగారి ఆత్మకథ ’శతపత్రం’ అకాడెమి పురస్కారం అందుకొన్న పుస్తకాలు.
వాటి తెలుగు పుస్తకాలు లభ్యం. ఐతె కన్నడ అనువాదాలు అలభ్యం. కేవలం గ్రంథాలయాలలోనే గాక, పాఠశాల, కళాశాలలోనూ, పుస్తకాలు కొనాలి. తెలుగు పత్రికలలొ మంచి విషయాలు ప్రచురితం జగమెరగిన సత్యం. శాఖా గ్రంథాలయాలలొనూ, జిల్లా కేంద్ర గ్రంథాలయాలలోనూ, దిన, వార, పక్ష, మాస పత్రికల కొసుగోలుపై మితి ఉండకూడదు. పాఠ శాలలొ, కళాశాలలొ, వీలైనట ఎక్కువ కొనుగోలు చెయ్యాలి.
ఈ మధ్య అనుభవజ్నులు కూడా అంతర్జాలం, గూగుల్ వచ్చిన తరువాత గ్రంథాలయాల అవసరాన్ని ప్రశిస్తున్నాయి. మన్ దేశము జనాభా ౧౩౦ కోట్ళు. మన దేశములొ ౮౦ కోట్ళ చరవాణిలున్నట్ళు Telephone Regulatory Authority of India లెక్క ప్రకారం, భారత దేశములొ 80 కొట్ల చరవాణిలలొ 40 కోట్లలొ అంతర్జాలా సౌకర్యం కలిగినవి ఉన్నవి.
“యులెల్లవారికినెట్ల స్వాధీనమైయున్నదొ, అట్ళనె జ్నానము అందరికి స్వాధీనమైఉండవలయును;ఉదకము ఎల్లవారికి నెట్ళ సేవ్యముగానున్నదో, జ్నానమూ అందరికి అట్ళనే సేవ్యముగా నుండవలయును;
సూర్య చంద్ర మడలముల తేజస్సు ఎల్లవారికినెట్ళ సౌఖ్యప్రదముగానున్నదో, జ్నానమూ అందరికి సౌఖ్యప్రదముగా నుండవలయును.”
1914 ఎప్రిల్,10వ తేదిన ప్రథమాంధ్ర గ్రంథాలయ సభ అధ్యక్షోపన్యాసాన్ని ఉపక్రవిస్తూ,చిలకమర్తివారు వక్కాణించిన గ్రంథాలయ వేదం ఇది.
ఈ బాధ్యత సమాజం పై ఉన్నది; ప్రభుత్వం పై అంతకన్నా ఎక్కువ ఉన్నది. ఐదారు రూపాయిలిచ్చి ఒక పత్రిక కొనడానికి శక్తి లేని యువకులెందరో ఈ దేశములొ ఉన్నారు. మారు మూల పల్లెలలొ ఉన్న శాఖా గ్రంథాలయాలలొ కూడా రోజూ పత్రికలు చదువడానికి నూరు మంది వస్తున్నారు. ఇంకా ఎక్కువ సౌకర్యంగలిగిస్తె ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉన్నది.
సెలూన్ లో లైబ్రరీ, పది పేజీలు చదవితే డిస్కౌంట్
ప్రభుత్వానికి, అధికార వర్గానికి ఎన్నో సారులు గుర్తు చేశాము. రాజ్యాంగం 73 సవరణ, షెడ్యూలు,11, విషయం, 20కి అనుగుణంగా పంచాయతిలు గ్రామాలలొ గ్రంథాలయాలు నడపాలి. అవి అమలు చెయలేదు. ఆ బాధ్యతను  కూడా ప్రభుత్వం నిర్వహించాలి. సృజనాత్మక రచనలు ఎన్నో ప్రచురితమవుతున్నాయి. వాటి అత్యదిక నకళ్లు గోడౌన్ లలొ, రచయితల ఇండ్ళలొ చెదులు పట్టి పోతున్నాయు.సృజనాత్మకతను ప్రోత్రాహించవలసిన భాద్యత ప్రభుత్వానికున్నది.
వాటిని కొన్నడానికి ప్రత్యేకమైన వనరులున్నప్పుడు,ఆ బాధ్యత ఇమ్మదించి ఉన్నది. అందువల్ల ప్రజలనుండి వసూలు చేసిన సెస్సును, సకాలములొ ఉపయోగించకఫోవడం, దుర్వినియోగంగా పరిగణించపచ్చుగదా!.

(చంద్రశేఖర కల్కూర కర్నూలు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛెయిర్మన్. పుస్తక ప్రియుడు, భాషాభిమాని)