మంచి వార్త, ఏప్రిల్ కల్లా కరోనా కష్టాలు తగ్గుతాయి, సూచనలివే : చైనా నిపుణుడి ఆశాభావం

చైనాలో దాదాపు పూర్తిగా తగ్గిపోవడం, ఇటలీలో తగ్గుముఖం పడుతూ ఉండటం, కొన్ని యూరోపియన్ దేశాలలో పరిస్థితి మెరుగుపడుతూ ఉండటంతో ఏప్రిల్ చివరి నాటికి కరోనా అదుపులోకి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా, చైనా ప్రభుత్వానికి ఇలాంటి మహమ్మారి జబ్బుల మీల సలహా లిచ్చే టీమ్ నాయకుడు,  ప్రఖ్యాత రెస్పిరేటరీ డిసీజెస్ నిపుణుడు జాంగ్ నన్ షాన్ (Zhong Nanshan) ఈ విషయం నొక్కి   చెప్పారు. అయితే, వచ్చే ఏప్రిల్ లోపు మళ్లీ రాదన్న గ్యారంటీ లేదని కూడా ఆయన హెచ్చరిక కూడా చేశారు.
“With every country taking aggressive and effective measures, I believe the pandemic can be brought under control. My estimate is around late April,” Shenzen టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని South China Morning Post రాసింది.
ఆయన ఇంకా ఏంచెప్పారంటే… ‘ఏప్రిల్ తర్వాత వేసవి వేడి వాతావరణంలో కోవిద్-19 తప్పకుండా తగ్గు ముఖం పడుతుంది. అయితే, వచ్చే ఏప్రిల్ లోపు మరొక సారి తిరిగి దాడిచేయలేదని ఎవరూ చెప్పలేరు.’
“After late April, no one can say for sure if their will be another virus outbreak next spring or it will disppear with warmer weather… though the virus’ activity will certainly diminish in highter temperature.”
ఆయన ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో చెప్పలేదు. అయితే, ఇతర నిపుణులు కూడా అమెరికా, యూరోప్ దేశాలకు ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) డైరెక్టర్ మైక్ ర్యాన్ కరోనాపరిస్థితి మీద వ్యాఖ్యానిస్తూ లాక్ డౌన్ విధించిన తర్వాత యూరోప్ లో ఈ మహమ్మారి వ్యాపించడం తగ్గిందని  చెప్పారు.
అమెరికా కు సంబంధించి ఏప్రిల్ 20నాటికి ఆసుపత్రులలోకరోనా పీడితులు చేరడం తారాస్థాయికి చేరుకుంటుందని అదేశ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అధికారులు చెబుతున్నారు.
ప్రపంచంలో ఇపుడు మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య పదిలక్షలకు చేరింది. ఒక్కఅమెరికాలోనే 215,000 ఉన్నారు. యూరోప్ లో421,000 కరోనా బాధితులు ఉంటే ఇందులో సగం మంది ఇటలీ, స్పయిన్ నుంచే ఉన్నారు.
‘అమెరికా వంటి దేశాలు చాలా ఉధృతంగా కరోనా నివారణకుచర్యలు తీసుకుంటున్నాయి. చాలా కఠిన చర్యలను సమర్థవంతంగా తీసుకుని ప్రజలను ఇళ్లకే కట్టి పడేస్తున్నారు. ఇది ఫలితాలనిస్తూ ఉంది,’ అని జాంగ్ నన్ షాన్ అన్నారు
యూరోప్ లో సోషల్ డిస్టాన్స్ విధానం అమలుచేయడంతో 11 దేశాలలో కరోనా వ్యాప్తి తగ్గిందని దీని వల్ల కనీసం 59,000 వేల  మరణాలు ఆగిపోయాయని లండన్ ఇంపీరియల్ కాలేజీ అధ్యయనం ఒకటి వెల్లడించింది.
తర్వాత, ఇటలీలో ఆసుప్రతులలో చేరు వారి సంఖ్యతో తగ్గడంతో పాటు మరణాలు ఉధృతి కూడా తగ్గిందని, ఒక వారం రోజులు గా ఈ తగ్గుదల కనిపిస్తూ ఉందని అల్ జజీరా ఒక కథనం ప్రచురించింది. దీనితో కరోనా కష్టాలకథకు తొందర్లోనే ముగింపు ఉందనే ఆశాభావంవ్యక్తమవుతూ ఉంది.