శ్రీశైలం ప్రాజక్టు కు నిజంగానే ముప్పుందా?

శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ లోపాలపై ‘వాటర్ మన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యల జాగ్రత్తగాపాటించాల్సి ఉంది. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు గుర్తుంచుకోవాలి.రాజేందర్ గంగాజల్ లిటరేచర్ యాత్రలో భాగంగా శ్రీశైలం సందర్శించారు. అక్కడి ప్రాజక్టును పరిశీలించాక , ఇది ముప్పులో ఉందని వెల్లడించారు. ప్రాజక్టు మీద హైడ్రాలిక్ ప్రెజర్ ఎక్కువగా ఉందని, నెర్రలీనుతూ ఉందని చెబుతూ ప్రాజక్టును కాపాడుకోవాలని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రాజక్టు గురించి అనేక విషయాలను పరిశీలించాల్సిన అవసరముంది.
1. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ లోపాలపై వాటర్ మెన్ రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు శ్రీశైలం రిజర్వాయర్ భవిష్యత్తుపై తీవ్ర స్థాయిలో చర్చకు మరొక్కసారి ఆస్కారమిచ్చాయి.
2. 2009 వ సంవత్సరంలో శ్రీశైలం రిజర్వాయర్ కు కనివిని రీతిలో 26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, అదృష్టం కొద్ది శ్రీశైలం రిజర్వాయర్ విచ్చిన్నం కాకుండా నిలబడింది.
3. ఈ వరదతో శ్రీశైలం రిజర్వాయర్ ఫ్లంజ్పూల్ లో ఏర్పడిన గోతి, రిజర్వాయర్ గోడలకు ఏర్పడిన బీటలు శ్రీశైలం రిజర్వాయర్ భవిష్యత్తుపై తీవ్ర స్థాయిలో చర్చకు మొట్ట మొదటిసారిగా ఆస్కారమిచ్చాయి.
4. శ్రీశైలం రిజర్వాయర్ కు 10 సంవత్సరాల క్రితం వచ్చిన వరదల వలన అదృష్టం కొద్ది శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్ విచ్చిన్నంకాకుండా నిలబడ్డాయని సామాన్య ప్రజలు కూడా భావించారు.
5. ఇదే సందర్భంలో ఈ అంశాలపై నిపుణులు కమిటి కూడా అనేక సూచనలు చేసింది‌.
* శ్రీశైలం రిజర్వాయర్ పదికాలాలపాటు సుభిక్షంగా ఉండాలంటే తుంగభద్ర నదికి వరద కాలువ నిర్మాణం చేపట్టి, శ్రీశైలం రిజర్వాయర్ ను బైపాస్ చెసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు నీటిని తరలించడం.
* ప్లంజఫూల్ కు ఏర్పడిన గోతికి , రిజర్వాయర్ గోడలకు ఏర్పడిన మరమత్తులు చేపట్టడం.
6. అదృష్టాన్నే నమ్మిన పాలకులు పై అంశాలపై శాస్త్రీయ దృక్పధంలో కార్యాచరణ చేపట్టడంలో గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
7. తాత్కాలిక అంశాలను ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకే పాలకులు గత పది సంవత్సరాలుగా ప్రాధాన్యత నిచ్చారు.‌
8. శ్రీశైలం రిజర్వాయర్ సక్రమ నిర్వహణ పైనే నాగార్జునసాగర్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందన్న విషయాన్ని పాలకులు, అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
9. రాయలసీమ సాగునీటి సాధన సమితి విజ్ఞప్తి.
*ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మరి ముఖ్యంగా రాయలసీమ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ కు సంబంధించిన అంశాలపై గతంలో జరిగిన తప్పిదాలను విస్మరించి అధికార పక్షం క్రియాశీలక నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ పార్టీలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి విజ్ఞప్తి చేస్తున్నది.
* శ్రీశైలం రిజర్వాయర్ కు ఏర్పడిన బీటలు మరియు ఫ్లంజ్ ఫూల్ గోతుల మరమత్తులు శాస్త్రీయంగా చేపట్టాలి.
* తుంగభద్ర వరద కాలువ నిర్మాణం గుండ్రేవుల లేదా మాలిగ్నూర్ నుండి చేపట్టి శ్రీశైలం రిజర్వాయర్ బైపాస్ చేసి నీటిని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ తరలించాలి.
* శ్రీశైలం రిజర్వాయర్ లో పూడిక చేరడం అరికట్టి ప్రాజెక్టు జీవితం కాలం పెంచే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలి.
-బొజ్జా దశరథ రామి రెడ్డి
(President, Rayalaseema Saaguneti Saadhana Samiti)