విగ్రహం గొడవలో ఎమ్మెల్యేకి గాయాలు, ఇంతకీ గొడవేంటో తెలుసా?

రాణిఅవంతి బాయ్ విగ్రహం ఏర్పాటు గురించి నిన్న అర్థరాత్రి పోలీసులకు, గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కి మధ్య గొడవయింది. గొడవలో రాజా సింగ్ గాయపడ్డారు. పోలీసులు దాడి చేస్తే తనకు గాయాలయ్యాయని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. కాదు, ఆయన రాయితో తలమీద కొట్టకుని గాయం చేసుకుని పోలీసులమీద ఆరోపణలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
గొడవెందుకు జరిగిందంటే, రాత్రి బాగా పొద్దుపోయాక రాణి 1857నాటి స్వాతంత్ర్య పోరాట యోధురాలు రాణి అవంతి బాయ్ లోద్ పాత విగ్రహం స్థానే కొత్త విగ్రహం పెట్టేందుకు రాజాసింగ్ ప్రయత్నించారు.
దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో గొడవయింది. ఇందులో రాజాసింగ్ తలకి గాయమయింది. అయితే విగ్రహం మార్చేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని పోలీసు అధికారులంటున్నారు. ఈ గొడవ ఈ తెల్లవారుజామున 1.30 గం. సమయంలో జరిగింది.
గోషామహల్ నియోజకవర్గం హైదరాబాద్ ఓల్డ్ సిటిలో ఉంటుంది. ఎపుడై ఎంఐఎం గెలవని వోల్డ్ సిటీ నియోజకవర్గం ఇదే.
ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన ప్రజలెక్కువగా ఉంటారు. రాజాసింగ్ కూడా ఇలా వచ్చిన వాడే. ఈప్రాంతంలో ఆయన చాలా పేరుంది. వివాదాస్పదన ప్రకటనలు చేసి ఎపుడూ వార్తల్లో ఉంటారు.
ఆ మధ్య పాకిస్తాన్ సైన్యం తాను రాసిన గీతాన్ని కాపి చేసిందని వివాదం రేకెత్తించి జాతీయ వార్తయ్యారు.
ఇంతకీ ఆయన నిలబెట్టాలనుకున్న రాణి అవంతి బాయ్ ఎవరో తెలుసా?
హైదరాబాద్ దూల్ పేట్ ఏరియాలోని గంగాబౌళిలో రాణి అవంతీబాయ్ లోద్ భవనం కూడా ఉంది. ఈమధ్య ఇది హిందూ కార్యకలాపాలకు కేంద్రమయింది.
శ్రీరామ నవమిశోభాయాత్ర, హనుమాన్ జయంతి ఉత్సవాలు, ఇతర బైక్ ర్యాలీలు ఇక్కడి నుంచి మొదలవుతుంటాయి.
రాణి అవంతి బాయ్ గురించి…
అవంతి బాయ్ ని చరిత్రలో ఒక వీరనారిగా కీర్తిస్తారు. ఆమె రామ్ గడ్ సంస్థానం రాణి. మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వీర నారీమణులలో ఆమె ఒకరు.
ఆమె 1931లో జన్మించారు. మధ్య ప్రదేశ్ లోని మండ్ల జిల్లాలో ఒకపుడు రామ్ గడ్ సంస్థానం ఉండేది. దానిని పరిపాలిస్తున్న విక్రమాధిత్య లోద్ భార్య అవంతి బాయ్.
చిన్నప్పటి నుంచిఆమెకు స్వతంత్ర భావాలుండేవని చెబుతారు. రాజవంశంలో పుట్టినందున ఆమె కత్తిసాము, విలువిద్య,, గుర్రపు స్వారీ, యుద్ధవ్యూహాలు,రాయబారాల వంటిరాచ విద్యలన్నింటిలో శిక్షన పొందారు.
విక్రమాధిత్య అనారోగ్యంతో ఉండటంతో రామ్ గడ్ సంస్ధానం పాలనాబాధ్యతలను ఆమె స్వీకరించారు. విక్రమాధిత్య చనిపోయాక ఆమె పూర్తి పాలకు రాలు అయ్యారు.
1848లో లార్డ్ డల్ హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ తీసుకువచ్చిన విషయం తెలుసు కదా. ఈ చట్టం ప్రకారం, వారసుడు లేకపోతే, ఆ రాజ్యాన్నిఈ స్టిండియా కంపెనీ స్వాదీనం చేసుకుంటుంది.
అవంతీబాయ్ కి కూడా సంతానం లేదు. అందువల్ల 1851లో ఈస్టిండియా కంపెనీ రామ్ గడ్ ని కోర్ట్ ఆఫ్ వార్డ్స్ కిందికి తీసుకువచ్చారు. కోర్ట్ ఆఫ్ వార్డ్ అంటే వారసులు లేని సంస్థాలను పాలించేందుకు ఏర్పటాయిన కమిటీ.
ఇది తన సంస్థానాన్ని కభళించేందుకు బ్రిటిష్ వాళ్లు చేస్తున్నగా కుట్ర అవంతి బాయ్ భావించారు.
కోర్ట్ ఆఫ్ వార్డ్స్ కింద కంపెనీ నియమించిన అడ్మినేష్ట్రేటర్ ఆమె తరిమేసింది. బ్రిటిష్ వాళ్ల మీద యుద్ధం ప్రకటించింది.
వెంటనే చుట్టుపక్కల ఉన్న సంస్థానాలకు రాయబారులను పంపి అన్యాయంగా రాజ్యాలను కభళించేందుకు కంపెనీ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా తాను చేస్తున్నయద్ధానికి మద్దతునీయాలని కోరారు.
ఇతర రాజులను బ్రిటిష్ వారికి వ్యీతిరేకంగా కూడగడుతున్నట్లు గ్ర హించిన కంపెనీ అధికారులు ఆగ్రహోదగ్రులయ్యారు. ఆమె ఇరుగుపొరుగు రాజులకు రాసిన లేఖలో ని పదజాలం వాళ్లకి బాగా కోపం తెప్పించింది.

 

ఆమె లేఖలో ఏమి రాశారంటే… “If you think you have a duty towards our enslaved motherland, raise your swords and jump into the war against the British. Otherwise wear these bangles and hide yourself in houses.”
అవంతీ బాయ్ పిలుపునకు అంతా స్పందించారు. ఇప్పటి మధ్య ప్రదేశ్ ప్రాంతాన్ని అపుడు సెంట్రల్ ప్రొవిన్స్ అనే వాళ్లు. ఈ ప్రాంతమంతా తిరుగుబాటు మొదలయింది.
1857 నాటికి ఈ ప్రాంతం బ్రిటిష్ వ్యతిరేకతతో కుతకుత వుడుకుతూ ఉంది. నాలుగు వేల మందితో ఒక సైన్యం తయారుచేసి తనే ముందుండి యుద్ధానికి నడిపించారు. బ్రిటిష్ వారితో తలపడ్డారు.
బ్రిటిష్ వారితో ఆమె మొదటి సంగ్రామం ఖేరీ అనే గ్రామంలో జరిగింది. ఆమె యుద్ధ వ్యూహానికి, యుద్ద చాతుర్యానికి బ్రిటష్ సేనలు తట్టుకోలేకపోయాయి. ఓడిపోయాయి.
పరాభవం భరించలేక,బ్రిటిష్ వారు రెట్టించినబలంతో రామ్ గడ్ మీద దాడి చేశారు, కోటకు నిప్పు పెట్టారు. రాణికుటుంబ సభ్యలతో దేవ్ హరిగడ్ అడవుల్లోకిపారిపోవలసి వచ్చింది.
అయినా సరే అవంతి బాయ్ బ్రిటిష్ వారిని వదలిపెట్టలేదు. గెరిల్లా యుద్ధతంత్రం ప్రయోగించి వారిని ముప్పతిప్పలు పెట్టింది. బ్రిటిష్ జనరల్ వాడింగ్టన్ శిబిరం మీద దాడి చేసింది. అయితే, ఆమె గెరిల్లా దళాలు, బ్రిటిష్ సేనకు తట్టుకోలేకపోయాయి. తనకు ఓటమి తప్పదని భావించింది.
బ్రిటిష్ వారిచేతిలో ఓడిపోయే అవమానం ఆమె వూహించలేకపోయారు. 1858 మార్చి 20న ఆమె తన కరవాలంతో పొడుచుకుని ఆత్మాహుతి చేసుకున్నారు.
మరణానంతరం ఆమె జీవితం జానపధ గాథల్లోకి ఎక్కి ప్రజలకు స్ఫూర్తి నిస్తూ వస్తున్నది.జబల్ పూర్ జలవిద్యుత్కేంద్రానికి అవంతి బాయ్ లోధి సాగర్ అని పేరు పెట్టారు. ఆమెపేరుతో పోస్టల్ శాఖ తపాలబిళ్లను కూడా విడుదల చేసింది.
ఉత్తర భారతం నుంచి నిజాం కాలంలో పెద్ద ఎత్తునప్రజలు హైదరాబాద్ కు వలస వచ్చారు. వారిలో లోధ్ లుకూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాజాసింగ్ కూడా లోధ్ యే. ఆమె జ్ఞాపకార్థం నిర్మించిందే లోధ్ భవన్. ఇపుడు గొడవ వెనక ఇంతకథ ఉంది.