రు.1.20 కోట్ల గూగుల్ జాక్ పాట్ కొట్టేసిన కుర్రకుంక వీడు…

ఇంకా ‘కుర్రదనం” ముఖం నుంచి చెదరి పోని వీడి పేరు ఆదిత్య పలివల్.వయసు 22 సంవత్సరాలు. ఈ వయసులోనే గూగుల్ జాక్ పాట్ కొట్టేశాడు.
గూగుల్ ఆర్టిఫిషెల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రీసెర్చ్ కోసం అంతర్జాతీయంగా నిర్వహించిన పరీక్ష పాసయ్యాడు. జాక్ పాట్ కొట్టేశాడు. ప్రపంచం నలుమూలలనుంచి ఆరువేల మందికి పైగా ఈపరీక్ష రాశారు. ఇందులో నుంచి 50 మంది ని ఎంపిక చేసుకున్నారు. వారిలో పలివల్ ఒకడు. అతనికి గూగుల్ అందిస్తున్న ప్యాకేజీ ఎంతో తెలుసా… రు.కోటి ఇరవై లక్షలు.
ముంబైకి చెందిన పలివల్ బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ అప్ ఇన్ ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటిబి) ఇంటెగ్రేటెడ్ ఎంటెక్ చదివాడు.గూగుల్ ఆర్టిఫిషెల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ టీంలో ఈ నెల 16 వ తేదీన చేరుతున్నాడు.గూగుల్ నుంచి ఈ అవకాశం రావడంతో చాలా సంతోషంగా ఉందని తన ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయలేక క్లుప్తంగా మీడియా కు చెప్పాడు.
గూగుల్ టీం పనిచేసేటపుడు మరిన్ని కొత్త విషయాలు నేర్చుకునేందుకునాకు అవకాశం దొరుకుతుందని ఆయన అన్నారు. పలివ ల్ కుడ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇక స్పోర్ట్స్ ను రెగ్యులర్ ఫాలో అవుతాడు. అతని పేవరెట్స్, సాసర్ , క్రికెట్..
పలివల్ గూగల్ టీంలో ఒక ఏడాది పాటు పనిచేస్తాడు. తర్వాత తన కిష్టమయిన తన అసైన్ మెంట్ ను ఫుల్ టైం జాబ్ గా మార్చుకునే అవకాశం కూడా ఉంది.
ముంబాయిలో స్కూల్ చదువు పూర్తి చేశాక, 2013 లో పలివల్ బెంగుళూరు ట్రిపుల్ఐటి బి లో అయిదు సంవత్సరాల ఇంటెగ్రేటెడ్ ఎంటెక్ కోర్సు చేరాడు.2018లో ఈ కోర్సు పూర్తయింది. ఈ యేడాది మార్చిలో పలివల్ కు గూగుల్ నుంచి ఆఫర్ వచ్చింది.
ఈ పరీక్షే కాదు, పలివల్ మరొక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పరీక్ష కూడా పాసయ్యాడు. 2017, 2018లలొ ఎసిఎం ఇంటర్నేషనల్ కాలేజీయేట్ ప్రోగ్రామింగ్ కంటెస్టు (ICPC) పాసయ్యాడు. ప్రపంచ వ్యాపితంగా లాంగ్వేజ్ కోడింగ్ కాంపిటీషన్ పరీక్ష ఇది.

 

(ఇది నచ్చితే షేర్ చేయండి.trendingtelugunews.com ను ఫాలో అవండి. జనం కోసం జర్నలిజం కు ప్రోత్సాహమీయండి.)