Home English కేటిఆర్ సభలోనే రైతు ఆత్మహత్యాయత్నం, విషమం

కేటిఆర్ సభలోనే రైతు ఆత్మహత్యాయత్నం, విషమం

356
0

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ పాల్గొన్న రైతుబంధు చెక్కుల పంపిణీ సభలో అపశృతి చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాష్ర్ట ఐటి శాఖ మంత్రి కేటిఆర్ రైతు బంధు చెక్కులను పంపిణీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓగులాపూర్ గ్రామానికి చెందిన ఇల్లందుల కిష్టయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తెలంగాణలో నిరుపేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు కాలేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నాలుగేళ్లయినా మూడెకరాల భూమి రాలేదన్న బాధతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఆ రైతు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హుటాహుటిన స్థానికులు, పోలీసులు కిష్టయ్యను ఆసుపత్రికి తరలించారు. కేటిఆర్ సభలో ఈ ఘటన జరగడం సంచలనం రేపింది. ఈ ఘటన తాలూకు మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here