యవ్వారం చెడిపోతాంది సార్, రాష్ట్రపతికి మాజీ సైనికాధికారుల లేఖ

సైన్యానికి జేజేలు అనో, మోదీ జీ కా సేన అనో, సైన్యాన్ని అవమాన పరుస్తున్నారనో, సర్జికల్ స్ట్రయిక్ అనో, బాలాకోట్ దాడులనో ఏదో విధంగా సైన్యం పేరు ప్రచారంలోకి లాగుతున్నందుకు ఎనిమిది మంది మాజీ ప్రధానసేనాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తమ అసంతృప్తిని వారు భారత సర్వసైన్యాధికారి అయిన రాష్ట్రపతికి దృష్టికి తీసుకువచ్చి, రాజకీయాల్లోకి సైన్యం పేరు లాగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మిలిటరీ పేరును ప్రచారంలో వాడుకోవడం తీవ్రం కావడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో మిలిటరీ పదప్రయోగాన్ని అపేయాలని, మిలిటరీ చర్యలను, సిబ్బంది పేరు వాడుకోవడాన్ని ప్రస్తావించడాన్ని ఆపేయాలని అన్ని రాజకీయ పార్టీలకు అదేశాలివ్వాలని వారు రాష్ట్రపతిని కోరారు.

ఎన్నడూ లేని విధంగా దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మిలీటరీ వాడుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఇలా మాజీ సైనికాధికారలు రాష్ట్రపతికి లేఖ రాయడం ఇదే తొలిసారి.

రాష్ట్రపతి రాసిన లేఖ మొదటి విడత పోలింగ్  ముగిశాక  గురువారం అర్దరాత్రి   బయటకు వచ్చింది.

లేఖ మీద సంతకం చేసిన వారంతా భారత సైన్యంలో పనిచేసిన యోధానుయోధులే. సంతకం చేసిన వారి పేర్లు: జనరల్ ఎస్ ఎఫ్ రోడ్రిగ్స్,జనరల్ శంకర్ రాయ్ చౌదరి, జనరల్ దీపక్ కపూర్, అడ్మిరల్ లక్ష్మినారాయణ రామ్ దాస్, అడ్మిరల్ విష్ణు భగత్, అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్, అడ్మిరల్ సురేష్ మెహ్తా, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ సి సూరి.

’ఏ మాత్రం అమోదయాగ్యం కాని విధంగా రాజకీయ పార్టీలు సరిహద్దుల దాటి చేసే మిలిటరీ దాడులను ఎన్నికల్లో ప్రస్తావిస్తున్న అసాధారణ విధానాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం. ఈ తీరు సైన్యాన్ని మోదీ జీ సేనా అనే స్థాయి దాకా వెళ్లింది,’ అని వారు లేఖలో పేర్కొన్నారు.

లేఖలో ఏ రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించలేదు. అయితే,మంగళవారం నాడు మహారాష్ట్రలోని ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ , బాలాకోట్ వైమానికి దాడికి తమ వోట్లను అంకితం చేయాలని మొదటి సారి వోటేస్తున్న యువకులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునీయడం తర్వాత ఈ లేఖ రాష్ట్రపతికి చేరింది.

ఇపుడు సరిహద్దుల వెంబడి సేవలందిస్తున్న సైనికాధికారులు కూడా అదే అభిప్రాయాలతో ఉన్నారని వారు లేఖలో పేర్కొన్నారు.

వాళ్లనాడి మీద వేలు పెట్టి చూసిన తర్వాతే తామిలా సర్వీసులో ఉన్నవారిత్ పాటు రిటైరయిన అధికారుల మనోభావాలను భారత సైనికదళాల సుప్రీం కమాండర్ విజ్ఞప్తి చేయాల్సి వస్తున్న దని వారు పేర్కొన్నారు.

భారత సైనికదళాల రాజకీయాతీత స్వభావాన్ని కాపాడాలని వారు రాష్ట్రపతిని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *