హోదా మీద చంద్రబాబుకు క్లారిటీ లేదు: పవన్

జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పని  పూర్తయిన సందర్భంగా జనసేన నేత పవన్ కల్యాణ్ ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు పెట్టకుండా తీవ్ర విమర్శ చేశారు. అందులో ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద ఎంతో అనుభవజ్ఞుడయిన ముఖ్యమంత్రికి క్లారిటీ లేదని అన్నారు. ఆయన కన్ఫూజన్ లో ఉన్నారని కూడా పవన్ అన్నారు.విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలు:

 

2014 ఎలక్షన్ లకి ముందుబిజెపి,టిడిపి ల కోసం  ప్రచారం పాల్గోనటం తో ప్రజలకు నేను జవాబుదారిని అయ్యాను. దీని వల్ల నువ్వేం చేస్తున్నావని  ప్రజలు నన్ను నిలదీస్తున్నారు. అందరూ నన్న బి జె పి, టి డి పి పార్టనర్ అని నిందిస్తున్నారు.

కేంద్ర సహాయం ఎంత అందింది, ఎంత అందాల్సి ఉంది అనే అంశాలను పరిశీలించేందుకువేసిన జెఎఫ్ సి పదకోండు అంశాలను గుర్తించింది.

 

విభజన చట్టం లో చాలా అంశాలు ఉన్నాయి.. కాని ముఖ్యమైన వాటిని మాత్రమే ప్రజల ముందు ఉంచుతున్నాము :

 

1.   అంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం

 

2.   గతంలో కూడా నేను తిరుపతి లో మీటింగ్ లో అడిగా ప్రత్యేక హోదా ఇస్తారాలేదా అని

 

3. తరువాత కాకినాడ మీటింగ్ కి వెళ్తున్నప్పుడు హడావిడి అర్ధరాత్రి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం అన్నారు

 

5. కాకినాడ మీటింగ్ లో నేను ప్రత్యేక ప్యాకేజీని  పాచి పోయిన లడ్డులు అని అన్నారు. తెలుగు దేశం పార్టీ పాచి పోయిన పర్వాలేదు అన్నారు. ఇప్పడు అవి కూడా ఇవ్వలేదు

 

4. రాజకీయ నాయకులు ప్రత్యేక హోదా వాడుకుని వదిలేస్తున్నారు

 

5. ముఖ్యమంత్రి కూడా అనేక ప్రకటనలతో ప్రజలను అయోమయం కి గురిచేస్తున్నారు

 

 

6. స్వయంగా ప్రధాని  చెప్పినా ప్రభుత్వం ఎర్పడిన తరువాత ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావటం లేదు

 

7. ముఖ్యమంత్రి చంద్రబాబు ,పార్లమెంటు సభ్యులు ,శాసన సభ్యులు కూడా నాలుగు సంవత్సరాల గడిచినా కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తేవడం లేదో అర్ధం కావటం లేదు

 

 

8. ప్రత్యేక హోదా ఇస్తేనే అంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మా కమీటి నిర్ణయం

 

 

9. పుండు మీద కారం చల్లినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని నిధులు విడుదల చేయ్యటం లేదు

 

10. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయ్యలి సరైన సమయంలో నిధులు మంజూరు చేయ్యాలి

 

11. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు తీసుకోకుండా ఉండాల్సి ఉంది. ఇపుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడిగే చాన్స్ పోయింది

 

12. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాక పోతే రాష్ట్ర ప్రభుత్వమే  సమాధానం చెప్పాలి

 

13. విశాఖపట్నం రైల్వే జోన్ హమీ ఏమైంది?  అక్కడ అనూకులం కాదంటున్నారు.  మరయితే పార్లమెంటు లో ఎందుకు మాట ఇచ్చారు

 

14. ఒక్కసారి పార్లమెంటు లో ప్రజలకు మాట ఇచ్చిన తరువాత అమలు చేయ్యకపోతే ప్రజలను పాలించే నైతిక హక్కు ను కోల్పోతున్నాము

 

15. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వన్ని ప్రశ్నంచాటానికి  రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్ధం కావటం లేదు

 

16.  దుగ్గరాజపట్న పోర్టు నిర్మాణం వీలుకానపుడు రాష్ట్ర ప్రభుత్వం మరో చోటు ఎందుకు చూపెట్టలేదో సమాధానం చెప్పాలి

 

17. విజయవాడ విశాఖపట్నం మెట్రో ఎందుకు వీలుకాడం లేదు. ఇది కూడా విభజన చట్టం లో హమీ ఇచ్చిన అంశమే కదా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *