బుల్ బుల్ యాప్స్ : ఈ హైదరాబాద్ స్టార్టప్ ఇంకో సూపర్ డూపర్ హిట్

కధ చెప్పడమనేది సమాజమంత పురాతన అలవాటు. ఎన్నియుగాలు మారిన కథ చెప్పడం ఆగిపోలేదు. కాకపోతే, చెప్పేతీరు మారిపోతుంది.చిన్నపుడు పెద్దవాళ్లు పిల్లలకు కథ చెప్పేవాళ్లు. పెద్దవాళ్లకు పండితులు, కథకులు కథలు చెప్పేవాళ్లు, మనిషి సమాజంలో సభ్యుడు కావడం కథలతోనే ప్రారంభమువుతుంది. కథ చెప్పని మనిషుండడు. కథ వినని మనిషుండదు. ఇక పిల్లల గురించి చెప్పనవసరం లేదు. కథ పిల్లలు కలసి పెరుగుతుంటాయి.

అందుకే ప్రతి కాలంలో కథలకు,కథ చెప్పడానికి ప్రాముఖ్యం ఉండేది. కథలుచెప్పేవాళ్లకు చాలా గౌరవం ఉండేది. ఒక నాటినాటకాలు, నేటి సినిమా లు, టివిలు, న్యూస్ బులెటీన్లు, న్యూస్ పేపర్లు… ఇలా అన్నీ కథ (Story telling) చెప్పడం కిందకే వస్తాయి. అంటే కథ చెప్పడం ఇపుడొక పెద్ద బిజినెస్ అయింది. అందుకే ఈబిజినెస్ తన దారిలోకి తిప్పుకుని పిల్లలకు కథల చెప్పాలనుకున్నాడు దంతలూరి ప్రకాశ్. అంతే, బుల్ బుల్ యాప్స్ ను క్రియోట్ చేశారు.

టెక్నాలజీని ఉపయోగించి కథలు చెప్పి ప్రపంచ వ్యాపితంగా పిల్లలను అలరించడమే ఈ యాప్ లక్ష్యం. కథను డిజిటల్ యుగానికి తీసుకురావాాలి. వందలాది మంది కళాకారులను తీసుకుని అత్యుత్తమ క్వాలిటీ కథలు చెప్పడం మొదలుపెట్టారు. దీనితో బుల్ బుల్ యాప్స్ (Bulbulapps) భారతదేశంలో పిల్లలకోసం తయారైన మొట్టమొదటి యాప్ అయింది.

భారతదేశంలో ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలు 380 మిలియన్ల మంది దాకా ఉన్నారు. ఇందులో 50నుంచి 60 మిలియన్లు మంది ప్రిస్కూల్ లేదా నర్సరీలకు వెళ్తుంటారు. దేశంలో2.8 లక్షల దాకా రిజిస్టరయిన ప్రీస్కూల్స్ ఉన్నాయి. ప్రిస్కూల్స్, పిల్లలు, కథ చెప్పడం టారె్ట్ గా విడుదలయిన బుల్ బుల్ యాప్స్ ఇండియాలోనే కాదు, దాదాపు 20 దేశాలలో కూడాసూపర్ హిట్ అయింది. బుల్ బుల్ యాప్స్ కథల పుస్తకాల లైబ్రరీ అనుకోండి. దీనికోసం ప్రపంచంలోనిఅన్ని దేశాల కళాకారులతో కథలు రూపొందించారు. యాప్ విడులయిన ఒక ఏడాదిలోనే దాదాపు 2 కోట్ల స్టోరీ పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకున్నారు.

దీనితో పాటు ప్రీస్కూల్ మేనేజ్ మెంట్ వైపు కూడా ఆయన దృష్టి మళ్లించారు. ప్రీస్కూల్ విద్య అనేది భవిష్యత్తులో ఉన్నత విద్యకు పునాది వేస్తుంది. అందువల్ల ఇక్కడ బలమయి పునాది వేయాలి. అందుకే ఏ మూలన ప్రీస్కూల్ లో పిల్లలున్నా వాళ్ల ందరికి అంతర్జాతీయ స్థాయి ప్రీస్కూల్ విద్య అందించేలా యాప్స్ ను అభివృద్ధి చేశారు. చిన్న పిల్లలకు అవసరమయిన కంటెంట్ను ఆఫీస్ లలో కూర్చుని తయారు చేయడం కాకుండా, కళాకారులను, విద్యావేత్తలను, ఉపాధ్యాయులను, తల్లితండ్రులను… అందరిని సంప్రదించి వారి భాగస్వామ్యంతోనే రూపొందించారు. ఈ తరహా మొబైల్ కంటెంట్ లో ఇదేప్రధమం.ఇదే MyPreschoolApp.

అయితే, ఇదొక పూలబాట కాలేదు. ఈ యాప్ ను రూపొందించేందుకు, టీమ్ సభ్యలను, ఇన్వెస్టర్లను ఒప్పించేందుకు, యాప్ ను తయారుచేసే ప్రాచుర్యంలోకి తెచ్చేందుకుఅంటే ఇది ప్రజల దగ్గిరకు వెళ్లేందుకు, వాళ్లు దానిని వాడేలా చేసేందుకు, ఈ వాడకం నుంచి ప్రయోజనం పొందేందుకు చాలా స్ట్రగుల్ పడాల్సి వచ్చింది. అదొక సుదీర్ఘ ప్రయాణం అని అయనచెప్పారు.

విద్యార్థుల విజయవంతం కావడం మీద ప్రకాశ్ సొంత ఆలోచనలు కాదు, అనుభవం నుంచి వచ్చినవి. ఆయన వేలాది మంది గ్రాజుయేట్స్ ని , ఇంటర్న్ లను సంప్రదించారు. ఇక్కడ ఆయన అర్థంచేసుకున్నదేమంటే, విద్యలోె విజయవంతమయిన వాళ్లంతా మొదట్లో అందరికంటే ఎక్కువ కష్టపడిన వాళుఅని. విద్యార్థులు తమ చుట్టూ కచ్చితమయిన సోర్స్ నుంచి వచ్చిన సరైన సమచారం, తాము నేర్చుకోవడానికి వీలు కల్పించే సరైన మిత్రులు ఉండేలా చూసుకోవాలి. “It is important to surround yourself with right information from right sources and right set of people who you want learn from.”అని ఆయన సలహా.

డిజిటల్ టెక్నాలజీ యుగంలో పిల్లలను ఎలా ఎంగేజ్ చేయాలన్న ఆలోచన ఆయనను అమెరికానుంచి ఇండియా రప్పించింది. నిజానికి నిలకడ అయిన చల్లటి ఉద్యోగంలో అమెరికాలోఆయన హాయిగా ఉన్నారు. అయితే, ఆయనకు సంతృప్తి నీయలేదు. పసిపిల్లలు స్కూళ్లు, కథలు చెప్పడం అనే అంశాలకు ఆయన టెక్నాలజీ జోడించారు. ఈ రంగాలను ఎంచుకోవడంలోనే ఆయన సగం సక్సెస్ అయ్యారు. ఎందుకంటే, ప్రీస్కూల్స్ అర్గనైజ్డు సెక్టర్ కాదు. స్కూళ్లు రిజస్టరవుతాయిగాని, వాటిని నిర్వహించడం గురించి నియమాలు లేవు. ఎందుకంటే, ఇవింకా ప్రభుత్వ అజమాయిషీలోకి రాలేదు. అందువల్ల వాటికి సిలబస్ లేదు, కంటెంట్ లేదు, నిర్వహణ పద్దతులు లేవు. ప్రీస్కూళ్లలో ఏంజరుగుతున్నదో తెలుసుకునే అవకాశం తల్లితండ్రులకు లేదు, ప్రీస్కూల్ ప్రమాణాలను ఎలా పెంచుకోవాలో నిర్వాహకులకు తెలియదు. ఈ గ్యాప్ ని భర్తీ చేయడమే MyPreschoolApp. అందుకే అది సూపర్ హిట్టయింది.

(ఈ విజయగాథ నచ్చితే షేర్ చేయండి.మంచిజర్నలిజానికి చేయూత నీయండి)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *