రైల్లో టాయిలెట్ నీళ్లు వాడిన టీ కాంట్రాక్టర్ కు రు. లక్ష జరిమానా

షాకింగ్ వీడియో పేరుతో మూడు రోజుల కిందట మేం అందించిన వీడియో  స్టోరీ గుర్తుంది కదా. ఒక ట్రెయిన్ లో టీ కాపి చేసేందుకు టాయిలెట్ నీళ్లు వాడుతున్నప్పటి వీడియో అంది. అందులో తెలుగు సంభాషణలు కూడా ఉన్నాయి. కింద ఆ వీడియో చూడవచ్చు.

https://trendingtelugunews.com/toilet-water-is-mixed-with-milk-in-indian-railways/

ఈ వీడియో వైరలయి చివరకు రైల్వేవారికి చేరింది. విచారణ జరిగింది. చివరగా ఇది హైదరాబాద్- చెన్నై ల మధ్య నడిచే చార్మినార్ ఎక్స్ ప్రెస్ ( నెంబర్ 12759) లోజరిగినట్లు అధికారులు కనిపెట్టారు. ఇలా టాయిలెట్ నీళ్లు తోడుకోవడం 2017 లో జరిగింది. అదికూడ సికిందరాబాద్ స్టేషన్ లో జరిగింది. ఈనీళ్లు తీసుకున్నవారంతా పి శివప్రసద్ అనే టీ కాంట్రాక్టర్ దగ్గిర పనిచేసే కార్మికులు. ఇతగాడు సికిందరాబాద్ ఖాజీ పేట మధ్య పనిచేస్తుంటారు.

ఈ నేరానికి శివప్రసాద్ మీద లక్ష రుపాయల ఫైన్ విధించినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో చెప్పారు.

టాయిలెట్ నుంచి  నీళ్లు తీసుకుంటన్నట్లు చూపే వీడియో బయటపడగానే రైల్వే మరొకసారి ప్రయాణికుల విమర్శలకు గురయింది. దీనితో అధికారలు అప్రమత్తమై విచారణ జరిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *