కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ ప్రియాంక రాజీనామా,శివసేన వైపు చూపు


కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ ప్రియాంక చతుర్వేది పార్టీ కి రాజీనామా చేశారు.  ఈ మేరకు ఆమె  పార్టీఅధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుదీర్ఘ లేఖ రాశారు. గతంలో ఉత్తరప్రదేశ్ లో ఒక విలేకరుల సమావేశంలో తనను కించపరిచిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకున్నందుకు ఆవేదనతో ఆమె  పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

 

పార్టీ ఉత్తర ప్రదేశ్ విభాగం చిల్లరగాళ్ల కు మద్దతు నిస్తున్నదని ఆమె ఆరోపించారు.

పార్టీకి రాజీనామా చేస్తూనే ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో కాంగ్రెస్ ఆనవాళ్లు కూడా లేకుండా తుడిచేశారు. అకస్మాత్తుగా ఆమె బ్లాగర్, శారీ హోర్డర్, మదర్, కాలమిస్టు అని రాసుకున్నారు. గతంలో తన అకౌంట్ లో కాంగ్రెస్ పార్టీలోఉన్న తన పదవి గురించి కూడా పరిచయం వాక్యంలో చెప్పుకున్నారు.

ఈనెలలో కొంత మంది ఉత్తర ప్రదేశ్  కాంగ్రెస్ నాయకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. వారిని ఏప్రిల్ 15న పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే, వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవడంతో ఆమె నిరాశకు గురయ్యారు.

పార్టీ మహిళల రక్షణ, మర్యాద సాధికరతకు కట్టుబడి ఉన్నా, పార్టీలో కొంత ప్రవర్తన దీనికి అనుగుణంగా లేకపోవడం తనను బాధించినట్లు ఆమె రాహుల్ కు రాసిన లేఖలోపేర్కొన్నారు.

“What saddens me is that despite the safety, dignity,  empowerment of women being prooted by the party, and has been the call of the party, the same is not reflected in the action of some members of the party.”

అయితే, ఆమె ఉద్ధావ్ థాకరే నాయకత్వంలోని శివసేనలో చేరే అవకాశం ఉన్నట్లు మీడియా రిపోర్టులొస్తున్నాయి,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *