తెలంగాణ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్… కమలం గూటికి చేరిన డికె అరుణ

తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డికె అరుణ బిజెపిలో చేరారు. మంగళవారం ఉదయం బిజెపి నేత రాం మాధవ్ డికె అరుణ ఇంటికెళ్లి ఆమెతో చర్చలు జరిపారు. ఆ  తర్వాత సాయంత్రం ఢిల్లికి వెళ్లి అమిత్ షాతో చర్చలు జరిపారు.

మంగళవారం అర్ధరాత్రి దాటే వరకు  ఈ చర్చలు కొనసాగాయి. బుధవారం ఉదయం 2 గంటల సమయంలో డికె అరుణ బిజెపిలో చేరారు. అమిత్ షా డికె అరుణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి ఆమె ఎంపీగా పోటి చేయనున్నారు. డికె అరుణ రాజకీయ భవిష్యత్ కోసం అమిత్ షా ఆమెకు పూర్తి భరోసానిచ్చారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే ఆరుణ తెరాస అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో డీకే ఆరుణ భాజపాలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గతంలో నాగం జనార్దన్ రెడ్డి కూడా ఎంపీ సీటు కోసం పార్టీ మారారు. వాస్తవానికి డికె అరుణ కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ కోసం పోటి పడిన దాఖలాలు లేవని కాంగ్రెస్ నేతల ద్వారా తెలుస్తోంది. ఆమెకు ఎంపీ టికెట్ కావాలంటే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చేది కదా ఎందుకు పార్టీ మారారో అర్ధం కావడం లేదని పాలమూరు నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణ కీలక నేతలు పార్టీని వీడడం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *