రు.31 వేల కోట్లకు బ్యాంకుల్ని ముంచిన DHFL

పేరుమోసిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ DHFL (Diwan Housing Finance Limited) బ్యాంకులను రు. 31 వేల కోట్లకు ముంచిన మరొక స్కాం ను ఇన్వెస్టిగేట్ న్యూస్ పోర్టల్ కోబ్రా పోస్టు బయటపెట్టింది. ఈ సంస్థ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, అరుణ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లు.  వీళ్లు బోగస్ కంపెనీలు తెరిచి, అసంస్థల పేరుతో భారీగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది, ఆ డబ్బును ఈ బోగస్ కంపెనీలనుంచి డిహెచ్ ఎఫ్ ఎల్ అకౌంట్లలోకి మార్పించుకుని, ఆడబ్బుతో యుకె, దుబాయ్, మలేషియా తదితర దేశాలలో ఆస్తులు కొన్నారు. ఈ డబ్బుతోనే శ్రీలంకలో రు. 4000 కోట్లతో ఒక క్రికెట్ టీం ను కూడా కొన్నారు.

వీరంతా ఇపుడు దేశం నుంచి పరారయిపోతే, ఎవ్వరూ ఏమీ చేయలేదు. నీరవ్ మోదీ, ఆయన బంధువులు చేసిందదే. విజయ్ మాల్యా చేసింది కూడా అదే.

వాధ్వాన్ లు 31 వేల కోట్ల రుపాయలకు బ్యాంకులను ఎలా ముంచారో కోబ్రాపోస్టు బయటపెట్టింది. కోబ్రా పోస్టు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి మోదీ ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా ముఖ్యంగా రాఫేల్ డీల్ లో మోదీ పాత్ర మీద పోరాడుతున్న బిజెపి మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా హాజరయ్యారు. మొత్తం కుంభకోణం గురించి కోబ్రో పోస్టు ఒక ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేసింది.

వీడియో : https://www.youtube.com/watch?time_continue=15&v=oXyhkovrxag

కోబ్రా పోస్టు వెల్లండించిన అంత్యంత ఆసక్తికరమయిన విషయం ఒకటుంది. వాధ్వాన్ ప్రమోటర్స్ కు చెందిన గ్రూప్ కంపెనీలు భారతీయ జనతా పార్టీకి రు. 19.5 కోట్ల విరాళాలు సమర్పించాయి. ఈ విరాళాలు 2014-15 మధ్య అందాయి. చట్టం ప్రకారం లాభాలలో నడుస్తున్న కంపెనీలు తమ మూడేళ్ల లాభాలలో 7.5 మించకుండా పార్టీలకు విరాళం ఇవ్వవచ్చు. అయితే, ఈ నియమాన్ని (కంపెనీల చట్టం 2013,182 సెక్షన్) ఉల్లంఘించి వాధ్వాన్ కంపెనీలు బిజెపికి డొనేషన్ ఇచ్చాయి. ఎందుకంటే లెక్కల ప్రకారం, ఈకంపెనీలు నష్టాల్లో నయినా ఉన్నాయి, లేదా చట్టం విరాళాలు ఇచ్చేంత లాభాలు ఆర్జించడం లేదు. అయితే, ఈ ఆరోపణలు దురుద్దేశ పూర్వకమయనవని, కోబ్రా పోస్టు మీద కోర్టు కెళతామని డిహెచ్ ఎఫ్ ఎల్ అధినేతలు హెచ్చరించారు.

కోబ్రా పోస్టు లెక్కప్రకారం డిహెచ్ ఎఫ్ ఎల్ కు రు. 97 వేల కోట్ల అప్పులున్నాయి. ఇందులో 50 వేల కోట్లు బ్యాంకులకు బకాయి. స్టేట్ బ్యాంక్ వాటా రు. 11.5 కోట్లు. ఉదారంగా రుణం మంజూరు చేసింది స్టేట్ బ్యాంక్ యే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *