Home Breaking మోదీ గారు, మరీ ఇంత చవకబారా! : చంద్రబాబు నిప్పులు

మోదీ గారు, మరీ ఇంత చవకబారా! : చంద్రబాబు నిప్పులు

226
0

నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోడి బీహార్  రామ్ నగర్ ఆంధ్రప్రదేశ్ ని విభజించడం  చేసిన వ్యాఖ్యలు గర్హనీయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆ విభజనకు భారతీయ జనతాపార్టీ కూడా భాగస్వామి అన్న విషయాన్ని మోదీ మరచిపోరాదని ఈ రోజు అమరావతి ప్రజావేదిక లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఆంధ్ర నేల మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తూ  బీహార్ లో,జార్ఖండ్ లో అసందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానిస్తున్నారని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ వ్యాఖ్యాల తొలినుంచి ఆంధ్రప్రదేశ్ పట్ల మోదీ వ్యవహరిస్తున్న చౌకబారు తీరుకు కొనసాగింపేనని చంద్రబాబు అన్నారు.

మోదీ నోటీతో తీయగా మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నారని, ఇది ప్రధాని హోదాకు తగదని అన్నారు. గతంలో ఆంధ్రప్రజల వోట్లకోసం మోదీ చేసిన తీయటి ప్రసంగాలను ఆయన గుర్తు చేశారు.

‘తల్లిని చంపారు,బిడ్డను బతికించారు అని కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ దీనావస్థ గురించి  మాట్లాడారు. స్కామాంధ్ర కావాలా, స్కీమాంధ్ర కావాలా అని తిరుపతిలో మోడి అన్నారు. శాంతికాముకులైన విశాఖ ప్రజలకు బాంబుల సంస్కృతి కావాలా?అని అడిగారు.  జైలుకెళ్లే పార్టీ వైసిపితో పొత్తు ఉండదని విశాఖలో అన్నారు. ఈ విషయాలను మర్చిపోతెే ఎలా,’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

‘విభజన చట్టం అమలు కోసం 29సార్లు ఢిల్లీ వెళ్లి కోరాను.ఏ ఒక్క అంశం కూడా  పరిష్కారం చేయలేదు. పైపెచ్చు ఎదురుదాడి చేస్తున్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రధానిగా మీకు లేదా? విభజన చట్టం అమలుకు పదేళ్లు గడువు ఉంది. పంజాబ్ విడిపోయి 40ఏళ్లు అయ్యింది, ఏపికి 5ఏళ్లలోనే అన్నీ చేయాలా అని అనలేదా?,’ అని  ప్రధాని మాట మారుస్తున్న వైఖరిని చంద్రబాబు గుర్తు చేశారు.

అమరావతి నిర్మాణం గురించి మోదీ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం అని ముఖ్యమంత్రి అన్నారు.

’అమరావతి రాజధాని మేం గొప్పగా, గర్వపడేలా నిర్మించాలనుకుంటుంటే  మీరు మయసభ కడుతున్నారా అని ఎద్దేవా చేస్తారా? అమరావతి బాండ్లపై విమర్శలు చేశారు. యూసిలు ఇవ్వలేదని వంకలు పెట్టారు.పోలవరానికి ఢిల్లీలో అవార్డులిచ్చి ఇక్కడకొచ్చి విమర్శించారు,న్యాయం అడిగిన టిడిపి నేతలపై దాడులు చేయించారు. ప్రశ్నించిన వాళ్లపై ఈడి,ఐటి దాడులు చేయిస్తున్నారు. సన్ రైజ్ స్టేట్ బ్రాండ్ ను వక్రీకరిస్తూ ఆ సన్ వేరు, ఈ సన్ వేరు అని ఎద్దేవా చేశారు, లోకేష్ తండ్రిగారు అని అపహాస్యం చేశారు. నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించడం, చౌకబారు ప్రసంగాలు, కించపరిచే వ్యాఖ్యలు, మోడి మాటల ప్రధానే తప్ప చేతల ప్రధాని కాదు,’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఇది ప్రధాని హోదాలో ఉండే మనషి మాట్లాడే తీరేనా అన్ని అన్నారు.

‘ఆ 3  రాష్ట్రాలు, జార్ఖండ్, ఉత్తరాఖండ్ చత్తీస్ గఢ్ లు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని కోరుకున్నాయి. రాజధాని ఉన్న ప్రాంతాలు కావు అక్కడ విభజన కోరింది. ప్రత్యేక ప్యాకేజి ఇచ్చారు,కేంద్రం కూడా సహకరించింది,ఆనందంగా వెళ్లిపోయారు. కానీ ఇక్కడ జరిగింది అదికాదు. రాజధాని ఉన్న ప్రాంతమే ప్రత్యేక రాష్ట్రంగా కోరుకున్నారు. ఆ 3రాష్ట్రాల విభజన వేరు, ఇది రివర్స్ . ప్రాధమికాంశాలను విస్మరించి మోడి వ్యాఖ్యలు చేస్తున్నారు,‘ అని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు.

ఆంధ్రాకు అన్యాయం జరిగిందని గత ఎన్నికలపుడు అని అధికారంలోకి వచ్చాక ఎందుకు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

‘ఆరోజు మీరే అడిగినవి తరువాత మీరు ఎందుకు చేయలేదు? గౌరవంగా అమరావతి శంకుస్థాపనకు పిలిచాం. నువ్వేం చేశావు, మట్టి, నీళ్లిచ్చి పోతావా..?ఏపికి ప్రత్యేక హోదా ఎందుకివ్వలేదు..? విభజన చట్టంలో అంశాలు ఎందుకు చేయలేదు..?ఇంతమంది సంఘీభావం ఇస్తే నీకున్న అఢ్డంకి ఏమిటి.? అనేక రాష్ట్రాలు,పార్టీలు సహకరిస్తే మీకేం అభ్యంతరం? నాకు మెచ్యూరిటి లేదన్నావు, యూ టర్న్ బాబు అని ఎగతాళి చేశావు. చౌకబారు విమర్శలు చేశారు. మీరే చెప్పిన అవినీతి పార్టీకి ఇప్పుడు మీరే సహకరించారు.ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హతే మోడికి లేదు. ప్రత్యేక హోదా ఇచ్చి అప్పుడు మాట్లాడాలి మోడి. విభజన చట్టం అంశాలను నెరవేర్చిన తరువాతే ఏపిపై మోడి మాట్లాడాలి,‘ అని చంద్రబాబు మోదీ మీద తీవ్రంగా దాడిచేశారు.

మోదీ వన్నీ దిగజారుడు ప్రసంగాలని విమర్శించారు.

చంద్రబాబు మోదీని అడిగిన మరిన్ని ప్రశ్నలు:

ఆ రోజు ఆంధ్రాకు జరిగిన అన్యాయం చక్కదిద్దలేక పోయారు. విభజన గాయాలు మానుపట్టడానికి మీరేం చేశారు? గాయాలను మరింత పెంచే ప్రయత్నాలు చేశారు.

వెటకారపు వ్యాఖ్యలతో ఏపి ప్రజలనే టార్గెట్ చేశారు.
మొన్న ఎన్నికల్లో ఇక్కడికొచ్చి మీరేం చెప్పారు. ఎవరిని గెలిపించడానికి ఇక్కడ ప్రచారం చేశారు?

ఏపిలో మీరు గెలిచే పరిస్థితి లేదని తెలిసి ఎందుకొచ్చారు..?
వైకాపాను దొడ్డిదారిన గెలిపించడానికే టిడిపిని నిందించడం నిజం కాదా?

మీరే చెప్పిన అవినీతి పార్టీకి ఇప్పుడు మీరే సహకరిస్తున్నారా లేదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here