చైన్ స్నాచర్ కు ఎలా శాస్తి జరిగిందో చూడండి (వీడియో)

హైదరాబాద్, వరంగల్ రహదారిలో భువనగిరి సమీపంలో ఒక మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నది. ఆమె ఒంటరిగా వెళ్తున్నది. దీంతో వెంటనే ఆలస్యం చేయకుండా గొలుసు దొంగ రంగంలోకి దిగిండు. మహిళ మెడలో ఉన్న చైన్ తెంపుకుండు. ఆమె ఏడుస్తూ అరుపులు కేకలు వేసింది.

దీంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు మెయిన్ రోడ్డు అవతలి నుంచి ఇవతలికి ఉరికిండు ఆ దొంగ. అయితే అప్పుడే వేగంగా వస్తున్న కారు తగిలి ఇంతెత్తున ఎగిరి పడ్డడు. మల్లా పడ్డంక కూడా ఆ దొంగ మీదంగ ఇన్నోవా కారు పోయింది.

అయితే చైన్ దొంగ దోపిడీ చేసి పారిపోతున్న సమయంలో మహిళ ఏడుపు విన్న ఒక వ్యక్తి రోడ్డు ఇవతల నుంచి వీడియో తీస్తున్నాడు. అయితే చైన్ దొంగను వీడియో తీస్తుండగానే యాక్సిడెంట్ కూడా జరిగింది. వీడియో పైన ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *