హిందీ మంటలార్పేందుకు రంగంలోకి దూకిన తమిళ మంత్రులు

హిందీ వ్యతిరేకోద్యమం తమిళనాడులో పార్టీలకు అతీతంగా అంటుకోవడంతో కేంద్రం పరుగులు పెట్టింది. వెంటనే క్యాబినెట్ లోని ఇద్దరు తమిళమంత్రులు, అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ను పరిస్థితి విషమించకుండా చూడాలని పురమాయించింది.

కేంద్ర మానవ వనరుల శాఖ గత వారం విడుదల చేసిన నూతన విద్యావిధానం ముసాయిదా లో హిందీ లో బలవంతంగా రుద్దే ప్రతిపాదన ఉంది. హిందీయేతర రాష్ట్రాలలో ఇది చాలా సున్నితమయిన అంశమయినా, కేంద్రంలో బిజెపి చాలా బలపడింది కాబట్టి, ఎవరూ ఎదురు చెప్పరనే ఉద్దేశంలో నర్సరీ స్కూల్ నుంచి ఇంటర్ దాకా హిందీభాషను కంపల్సరీ సబ్జక్టును చేయాలన్న ప్రతిపాదనతో ముసాయిదాలో చొప్పించారు. దాని మే నెలాఖరుల ఈ ముసాయిదా విడుదల చేసి, రాష్ట్రాలు మౌనంగా ఉంటే అమలు చేద్దాం, లేదంటే మార్పు చేద్దామని చూశారు. అయతే, తమిళనాడు భగ్గున మండింది. ఈ సారి బెంగాల్ కూడా తోడయింది. దీనితో ఇద్దరు తమిళ మంత్రులను రంగంలోకి తమిళ మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని పంపించారు.వెంటనే జైశంకర్ తమిళం, ఇంగ్లీష్ లలో ఒక ట్వీట్ పెట్టారు.

‘ఇపుడు కేంద్ర మావన వనరుల శాఖకు అందించిన నూతన విద్యావిధానం అనేది ముసాయిదా మాత్రమే. దీనిమీద ప్రజలనుంచి అభిప్రాయాలను సేకరించడం జరగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించడం జరగుతుంది. వీటి తర్వాత ముసాయిదాకు తుదిరూపం ఇస్తారు. భారత ప్రభుత్వం అన్ని భాషలను గౌరవిస్తుంది. ఏ భాషను రద్దే ప్రసక్తి ఉండదు, అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

తమిళనాడు బెంగాల్ లలో వ్యతిరేకత రాగానే కేంద్రంలో కదలిక మొదలయింది.

నిర్మలాసీతారామన్ కూడా తమిళలో ఇదే విధంగా ట్వీట్ చేశారు. త్రి భాషా సూత్రం పేరుతో కేంద్రం హిందీని రుద్దేందుకు కస్తూరి రంగన్ నివేదికను వాడుకుంటూ ఉందని వస్తున్న ఆరోపణలకు ఆమె వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు.
“The draft policy submitted by the committee will be implemented only after consulting people. The Prime Minister has launched #EkBharatShreshtaBharat only with the motive of promoting all languages,”అని ఆమె తమిళలో చెప్పారు.

జైశంకర్, నిర్మలా సీతారామన్ లు కేంద్రంలో మంత్రులేగాని, వాళ్లు మేధావుల క్యాటగరిలోకి వస్తారు. రాజకీయనాయకులలాగా ప్రజలలతో సంబంధాలున్న వాళ్లు కాదు.అందువల్ల వాళ్ల మాటలు తమిళ ప్రజలు వింటారా? వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *