తెలంగాణలో మరో 1,831 కొత్త కరోనా కేసులు నమోదు

తెలంగాణలో ఈ రోజు మరో 1,831 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీనితో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  25,733కు చేరింది. రాష్టరంలో కరోనా నుంచి కోలుకుని మరో 2,078 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 14,781 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు కరోనాతో మరో 11 మంది మృతి చెందడంతో మొత్తం కరోనా మృతుల సఖ్య  306కు చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 10,646.
 ఈ రోజు ఒక్క  జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,419 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా 160 కేసులతో రెండో స్థానంలో ఉంది. మేడ్చల్ లో 117 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు  ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటీన్ ప్రకారం మొత్తం 19 జిల్లాలనుంచి కొత్తకేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు వివరాలు: